వేసవిలో శరీర వేడిని చల్లార్చే అద్భుతమైన పానీయాలు ఇవే!

వేసవి కాలం( Summer ) ప్రారంభం అయింది.చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి.

వేసవిలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ ఎంతో అవసరం.లేదంటే డీహైడ్రేషన్, సన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి ఎన్నో ప్రమాదకరమైన సమస్యలు చుట్టుముట్టే అవకాశాలు పెరుగుతాయి.

ఇకపోతే వేసవిలో శరీరంలో వేడి పెరిగిపోతూ ఉంటుంది.ఎండలో ఎక్కువ సమయం గడపడం వలన శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుంది.

దీని కారణంగా తల తిరగడం, కళ్ళు మంటలు, ముఖంపై మొటిమలు ఏర్పడటం తదితర సమస్యలు తలెత్తుతుంటాయి.

అందుకే బాడీ హీట్ ను మాయం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే శరీర వేడిని చల్లార్చడానికి కొన్ని అద్భుతమైన పానీయాలు ఉన్నాయి.

వాటిని తీసుకుంటే బాడీ చాలా వేగంగా చల్లబడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పానీయాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

రోజ్ టీ( Rose Tea ).వేసవిలో శరీర వేడిని తొలగించడానికి ఇది ఎంతో ఉత్తమం గా సహాయపడుతుంది.

రోజుకు ఒక కప్పు రోజ్ టీ తీసుకుంటే శరీరంలో అధిక వేడి మాయం అవుతుంది.

అలాగే రోజ్ టీ ను డైట్ లో చేయించుకోవడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.

మైండ్ చురుగ్గా పనిచేస్తుంది.చర్మ ఆరోగ్యానికి కూడా రోజ్ టీ ఎంతో మేలు చేస్తుంది.

"""/" / అధిక వేడిని తొలగించి శరీరాన్ని చల్లబ‌ర‌చడానికి మందారం టీ( Hibiscus Tea ) కూడా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది.

మందారం టీ తీసుకోవడం వల్ల బాడీ హీట్ మాయం అవుతుంది.వేసవి తాపం నుంచి విముక్తి లభిస్తుంది.

అధిక దాహం, డీహైడ్రేషన్ వంటి సమస్యల బారిన పడకుండా ఉంటారు.మరియు రక్తపోటు సైతం అదుపులో ఉంటుంది.

"""/" / వేసవిలో శరీర వేడిని చల్లార్చడానికి కొబ్బరి నీళ్లు సైతం సహాయపడతాయి.

ఒక గ్లాస్ కొబ్బరి నీటిలో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసి సేవించాలి.

ఇలా చేస్తే శరీరంలో అధిక వేడి చాలా వేగంగా తగ్గిపోతుంది.పైగా ఈ విధంగా కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

వామ్మో, ఇదేంది.. ఇండియన్ ట్రైన్ ఎక్కి బ్రిటిష్ యూట్యూబర్ షాకింగ్ పని.. సిగ్గుపడాలంటూ!