వేసవిలోనూ జలుబు వేధిస్తుందా.. అయితే ఇలా చేయండి!

సాధారణంగా శీతాకాలం, వర్షాకాలంలో జలుబు( Cold ) సమస్య అనేది అత్యంత కామన్ గా వేధిస్తూ ఉంటుంది.

కానీ కొందరు ప్రస్తుత వేసవి( Summer ) కాలంలోనూ జలుబు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.

మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.

ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ మీ జలుబు సమస్యకు వేగంగా చెక్ పెట్టడంలో అద్భుతంగా తోడ్పడుతుంది.

అందుకోసం ముందుగా ఒక నిమ్మ పండును( Lemon ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే రెండు నుంచి మూడు వెల్లుల్లి( Garlic ) రెబ్బలను పొట్టు తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో గ్లాసు వాటర్ పోసుకోవాలి.

వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న నిమ్మ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి.

అలాగే పావు టీ స్పూన్ పసుపు,( Turmeric ) చిటికెడు మిరియాల పొడి వేసి దాదాపు పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.

"""/" / ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో వన్ టీ స్పూన్ తేనె కలిపి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు తీసుకుంటే అద్భుత ఫలితాలు పొందుతారు.

ఈ డ్రింక్ ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది.జలుబు, దగ్గు వంటి సమస్యలను వేగంగా దూరం చేస్తుంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను తొలగిస్తుంది. """/" / అలాగే నిత్యం ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల బాడీలో పేరుకుపోయిన వ్యర్ధాలు తొలగిపోతాయి.

రక్తశుద్ధి జరుగుతుంది.కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.

అలాగే ఈ డ్రింక్ శరీరం యొక్క మెటబాలిజాన్ని సూపర్ యాక్టివ్ గా మారుస్తుంది.

దాంతో కేలరీలు కరిగే ప్రక్రియ వేగవంతం అవుతుంది.శరీరం బరువు నియంత్రణలో ఉంటుంది.