పాతికేళ్లకే వెన్ను నొప్పితో బాధపడుతున్నారా.. అయితే మీ డైట్ లో ఇది ఉండాల్సిందే!

వయసు పైబ‌డే కొద్ది ఎముకల సాంద్రత తగ్గడం సర్వసాధారణం.దాంతో మోకాళ్ళ నొప్పి, వెన్ను నొప్పి వంటివి తలెత్తుతుంటాయి.

కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది పాతికేళ్లకే వెన్ను నొప్పితో బాధపడుతున్నారు.ఇందుకు కారణాలు ఎన్నో ఉన్నాయి.

ఏదేమైనా వెన్నునొప్పి కి గురైనప్పుడు ఎక్కువ శాతం మంది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు.

అయితే అవి తాత్కాలికంగా మాత్రమే నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.కానీ ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను డైట్ లో చేర్చుకుంటే వెన్నునొప్పికి శాశ్వ‌తంగా అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఎనిమిది బాదం, వన్ టేబుల్ స్పూన్ వేరుశెనగలు( Peanuts ), వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు( Pumpkin Seeds ), వన్ టేబుల్ స్పూన్ పొద్దు తిరుగుడు విత్తనాలు వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న బాదం, వేరుశనగ, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు వేసుకోవాలి.

"""/" / అలాగే ఒక కప్పు ఫ్రెష్ హోమ్ మేడ్ కొబ్బరి పాలు( Coconut Milk ), నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తద్వారా మన డ్రింక్ సిద్ధం అవుతుంది.రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ డ్రింక్ ను తీసుకుంటే ఎముకల సాంద్రత అద్భుతంగా పెరుగుతుంది.

బ‌ల‌హీన‌మైన‌ ఎముకలు దృఢంగా మారతాయి.దాంతో వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పి దూరం అవుతాయి.

"""/" / అంతేకాదు ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.చర్మం యవ్వనంగా మెరుస్తుంది.

జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.అతి ఆకలి దూరం అవుతుంది.

వెయిట్ లాస్ అవుతారు.మరియు రక్తహీనత సమస్య సైతం ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి27, సోమవారం 2025