రోజూ ఉద‌యాన్నే ఈ డ్రింక్ తాగితే కీళ్ల నొప్పులు ప‌రార్‌!

కీళ్ల నొప్పులు.నేటి రోజుల్లో కోట్లాది మందిని తీవ్రంగా మ‌ద‌న పెడుతున్న స‌మ‌స్య ఇది.

వృద్ధులు మాత్రమే కాదు.యుక్త వయస్సులో ఉన్న వారు సైతం కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నారు.

పోష‌కాల కొర‌త‌, ఏవైనా దెబ్బ‌లు తగ‌లటం, కీళ్ల వాతం, ఒత్తిడి, ఆహార‌పు అల‌వాట్లు వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల కీళ్ల నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ కీళ్ల నొప్పుల‌ను వ‌దిలించుకోవాలంటే ఖ‌చ్చితంగా కొన్ని ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

లేకుంటే నొప్పులు మ‌రింత ఎక్కువ అవుతాయి.అయితే ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే డ్రింక్‌ను ప్ర‌తి రోజూ ఉద‌యాన్నే తీసుకుంటే గ‌నుక కీళ్ల నొప్పుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నివారించుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ డ్రింక్ ఏంటీ.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.

? వంటి విష‌యాల‌పై ఓ లుక్కేసేయండి.ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల మెంతులు, ఒక పెద్ద దాల్చిన చెక్క వేసి మెత్త‌గా పొడి చేసుకోవాలి.

ఈ పొడిని ఒక డ‌బ్బాలో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిని తీసుకుని.

అందులో త‌యారు చేసి పెట్టుకున్న మెంతి,దాల్చిన చెక్క పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ మోతాదులో క‌లిపి సేవించాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే గ‌నుక కీళ్ల నొప్పులు ప‌రార్ అవుతాయి.ఎముక‌లు దృఢంగా మార‌తాయి మ‌రియు కీళ్ల వాతం స‌మ‌స్య ఉన్నా దూరం అవుతుంది.

"""/"/ ఇక ఈ డ్రింక్ తీసుకోవ‌డంతో పాటు సీజ‌న‌ల్ పండ్లు, కూర‌గాయ‌లు, ఆకుకూరలు త‌ప్ప‌కుండా తీసుకోవాలి.

మైదా, బేకరీ ఫుడ్స్‌, వేపుళ్ళు, పంచదార, టీ, కాఫీలు వంటి వాటికి దూరంగా ఉండాలి.

రెగ్యుల‌ర్‌గా చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి.మ‌రియు పసుపు, అల్లం, వెల్లుల్లి ఈ మూడూ రెగ్యుల‌ర్ డైట్‌లో ఉండేలా చూసుకుంటే.

వాటిల్లో ఉండే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ కీళ్ల నొప్పులు త‌గ్గ‌డానికి గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

బాలీవుడ్ స్టార్ హీరోల పరువు తీస్తున్న ప్రభాస్.. బుకింగ్స్ తోనే చుక్కలు చూపిస్తున్నాడుగా!