రెండంటే రెండు వారాలు దీన్ని తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు మాయం!

మోకాళ్ళ నొప్పులు.వ‌య‌సు పైబ‌డిన వారిలోనే కాదు ఇటీవ‌ల రోజుల్లో యువకుల్లోనూ ఈ స‌మ‌స్య కామ‌న్‌గా క‌నిపిస్తోంది.

ఎముక‌లు బ‌ల‌హీనంగా మార‌డం, అధిక బ‌రువు, కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లు, శారీరక శ్రమ లేక పోవడం, ఏవైనా దెబ్బలు త‌గ‌ల‌డం వంటి కార‌ణాల వ‌ల్ల మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి.

దాంతో వాటిని త‌గ్గించుకునేందుకు ర‌క‌ర‌కాల మందులు వాడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే డ్రింక్‌ను రెండంటే రెండు వారాలు వ‌రు‌‌స‌గా తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు మాయం అవ్వ‌డం ఖాయం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు, రెండు టేబుల్ స్పూన్ల పుచ్చ గింజ‌లు, పావు స్పూన్ గ‌స‌గ‌సాలు, రెండు యాల‌కులు, మూడు మిరియాలు, రెండు జీడిప‌ప్పులు, రెండు బాదం ప‌ప్పులు వేసి వాట‌ర్ పోసి నాలుగు గంట‌ల పాటు నాన బెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత నీటిని తొల‌గించి బాదం ప‌ప్పుల‌కు ఉన్న పై తొక్క‌ను తొల‌గించాలి.

"""/"/ ఇప్పుడు వీట‌న్నిటినీ ఒక మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

ఆపై స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అర‌ లీట‌ర్ పాలు పోయాలి.

పాలు కాస్త వేడి అవ్వ‌గానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్ర‌మాన్ని వేసి బాగా మ‌రిగించి చివ‌రిగా బెల్లం క‌ల‌పాలి.

అనంత‌రం స్ట‌వ్ ఆఫ్‌ చేసి గ్లాస్‌లోకి స‌ర్వ్ చేసుకుని ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ స‌మ‌యంలో సేవించాలి.

ఇలా రెండంటే రెండు వారాలు చేస్తే ఎముక‌లు గ‌ట్టి ప‌డి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు క్ర‌మంగా దూరం అవుతాయి.

అంతేకాదు, పైన చెప్పిన విధంగా పాల‌ను త‌యారు చేసుకుని తాగితే నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.

మెద‌డు చురుగ్గా, వేగంగా ప‌ని చేస్తుంది.మరియు రోగ నిరోధ‌క శ‌క్తి సైతం అద్భుతంగా పెరుగుతుంది.

నాగ్ అశ్విన్ మీ ఓం రౌత్ లాంటి వాడు కాదు.. బాలీవుడ్ మెడలు వంచే మొనగాడు