నెలసరి సమయంలో కడుపు నొప్పి విపరీతంగా వస్తుందా.. అయితే ఈ డ్రింక్ ను మీరు తాగాల్సిందే!

సాధారణంగా కొందరికి నెలసరి చాలా తేలికగా అయిపోతుంది.కొంద‌రికి మాత్రం భరించలేని నొప్పులతో భారంగా గడుస్తుంది.

ముఖ్యంగా నెలసరి సమయంలో కొంద‌రు విపరీతమైన కడుపునొప్పితో తీవ్ర వేద‌న‌కు గుర‌వుతుంటారు.ఆ నొప్పిని త‌ట్టుకోలేక పెయిన్ కిల్లర్స్( Pain Killers) ను వేసుకుంటారు.

అయితే అలా ప్రతిసారి పెయిన్ కిల్లర్స్ ను వాడటం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.

అందుకే స‌హ‌జ పద్ధతిలో నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ప్రయత్నించాలి.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ అద్భుతంగా సహాయపడుతుంది.

నెలసరి సమయంలో ( Monthly Period )ఈ డ్రింక్ ను తాగితే కడుపు నొప్పి మాత్రమే కాదు మరెన్నో నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక చిన్న అల్లం ముక్క( Ginger ) తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ వాము, ఆరు ఫ్రెష్ తులసి ఆకులు( Basil Leaves ), ఐదు ఫ్రెష్ పుదీనా ఆకులు, వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి, పావు టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్( Black Salt ) వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆపై స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే టీ పొడిని వేసుకోవాలి.అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.

"""/" / ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని కొద్దిగా లెమన్ జ్యూస్ మిక్స్ చేస్తే మన డ్రింక్ సిద్ధం అయినట్టే.

నెలసరి నాలుగు రోజులు ఈ డ్రింక్ ను రోజుకు ఒక కప్పు చొప్పున తీసుకుంటే కడుపు నొప్పి అన్న మాటే అనరు.

అలాగే నడుము నొప్పి, కాళ్లు లాగడం, తలనొప్పి, చిరాకు వంటివి దూరం అవుతాయి.

మైండ్‌ రిఫ్రెష్ అవుతుంది.ఇక చాలా మంది మహిళలు నెలసరి సమయంలో జీర్ణ సంబంధిత సమస్యలను ఫేస్ చేస్తుంటారు.

అయితే వాటికి కూడా ఈ డ్రింక్ సూపర్ ఎఫెక్టివ్‌ గా చెక్ పెడుతుంది.

రూ.3 కోట్ల జీతం వదులుకున్న మహిళా న్యాయవాది.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!