పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌గా దీనిని ఇస్తే రోజంతా ఉత్సాహమే..!
TeluguStop.com
రోజంతా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండాలంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం ఎంత ముఖ్యమో.
బ్రేక్ ఫాస్ట్‌లో ఏం తింటున్నాము అన్నది కూడా అంతే ముఖ్యం.చాలా మంది పిల్లలు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేయడానికి అస్సలు ఇష్టపడురు.
అందులోనూ ఇడ్లీ, దోసె, వడ, ఉప్మా, పూరి వంటివి పెడితే పరుగులు పెట్టేస్తుంటారు.
అందుకే పిల్లల బ్రేక్ ఫాస్ట్‌ను ఎప్పుడూ డిఫరెంట్‌గా మరియు హెల్తీగా ఉండేలా చూసుకోవాలి.
అలాంటి రెసిపీనే బననా చియా సీడ్స్ స్మూతీ.సూపర్ టేస్టీగా ఉండే ఈ స్మూతీని పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారు.
పైగా దీని తయారీ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదు.ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు అరటి పండు ముక్కలు, వన టేబుల్ స్పూన్ చియా సీడ్స్, నైటంతా నీటిలో నాన బెట్టిన వాల్ నట్స్ రెండు, ఒక కప్పు పాలు, రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగు వేసి బ్లెండ్ తీసుకోవాలి.
"""/" /
ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా తేనె కలిపితే.బననా చియా సీడ్స్ స్మూతీ రెడీ.
ఈ స్మూతీ టేస్టీగా ఉండటమే కాదు.ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా దీనిని పిల్లలకు ఇస్తే.రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి కావాల్సిన శక్తి వారికి లభిస్తుంది.
అలాగే ఈ బననా చియా సీడ్స్ స్మూతీ పిల్లలకు ఇవ్వడం వల్ల.వారిలో ప్రోటీన్ కొరత ఏర్పడ కుండా ఉంటుంది.
మలబద్ధకం సమస్య ఉంటే దూరం అవుతుంది.మెదడు మునుపటి కంటే చురుగ్గా పని చేస్తుంది.
ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి.నాణ్యమైన నిద్రను పొందుతారు.
రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.మరియు నీరసం, అలసట వంటి సమస్యలు వారి దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉంటాయి.
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?