గుండె ఆరోగ్యాన్ని కాపాడే బెస్ట్ & టేస్టీ టీలు ఇవే..తాగుతున్నారా?
TeluguStop.com
ఇటీవల కాలంలో గుండె జబ్బుల బాధితులు భారీగా పెరిగిపోతున్నారు.ఈ నేపథ్యంలోనే గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి పోషకాహారం తీసుకోవాలని నిపుణులు తరచూ చెబుతుంటారు.
అయితే గుండె ఆరోగ్యానికి కాపాడంలో కొన్ని టీలు అద్భుతంగా సహాయపడతాయి.నిజానికి ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుసులు అనే తేడా లేకుండా చాలా మంది అమితంగా ఇష్టపడి తాగే పానియాల్లో టీ ఒకటి.
అయితే టీలోనే ఎన్నో రకాలు ఉన్నాయి.వాటిలో గుండె ఆరోగ్యానికి ఉపయోగ పడే బెస్ట్ & టేస్టీ టీలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలాచీ టీ ఎంత రుచిగా ఉంటుందో ఆరోగ్యానికి అంతే మేలు చేస్తుంది.రోజుకు ఒక కప్పుడు ఇలాచీ టీని సేవింస్తే గనుక అందులో ఉండే పొటాషియం రక్త పోటును అదుపులోకి తెస్తుంది.
అదే సమయంలో రక్తనాళాల్లో అడ్డంకులు తొలగించి గుండె పోటు, ఇతర గుండె సంబంధిత జబ్బులను దరి చేరకుండా అడ్డు కట్ట వేస్తుంది.
పైగా ఇలాయీ టీ తీసుకోవడం వల్ల బరువు సైతం తగ్గుతారు.అలాగే బ్లాక్ టీ కూడా హార్ట్ హెల్త్‌కు చాలా మంచిది.
రెగ్యులర్ ఒక కప్పు బ్లాక్ టీని తీసుకుంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగుతుంది.
"""/"/ దాంతో గుండె ఆరోగ్యం పెరుగుతుంది.గుండె జబ్బులతో బాధపడేవారూ బ్లాక్ టీని సేవించవచ్చు.
ఈ టీని తీసుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గుతుంది.రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
బ్రెయిన్ షార్ప్‌గా మారుతుంది.గుండెకే కాకుండా ఇలా బ్లాక్ టీతో అనేక హెల్త్ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.
"""/"/
ఇక లెమన్ టీ తీసుకున్నా గుండె జబ్బులు వచ్చే ముప్పు తగ్గుతుంది.
అవును, లెమన్ టీలో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ధమనుల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.పైగా లెమన్ టీ సేవిస్తే ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బూస్ట్ అవుతుంది.
ఇంట్లోనే ఫేషియల్ గ్లోను పొందాలనుకుంటే ఈ రెమెడీని ప్రయత్నించండి..!