స్పాట్‌లెస్ ఫేస్ మీసొంతం కావాలా? అయితే మీరీ క్రీమ్ వాడాల్సిందే!
TeluguStop.com
ఎటువంటి స్పాట్స్ లేకుండా అందమైన, మృదువైన, ప్రకాశవంతమైన ముఖం కావాలని కోరుకోని వారు ఉంటారా అంటే ఉండరు అనే నేను చెబుతాను.
ఎందుకంటే, స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా దాదాపు అందరూ అదే కోరుకుంటారు.
ఈ క్రమంలోనే ముఖ సౌందర్యం కోసం వేలకు వేలు ఖర్చు పెట్టి క్రీములను కొనుగోలు చేసి యూజ్ చేస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే క్రీమ్‌ను ఇంట్లోనే తయారు చేసుకుని వాడితే.ఎలాంటి ఖర్చు లేకుండానే స్పాట్ లెస్ ఫేస్ తమ సొంతం చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఈ న్యాచురల్ క్రీమ్ ఏంటో ఓ లుక్కేసేయండి.ముందుగా ఐదు బాదం పప్పులు, ఐదు పిస్తా పప్పులు, ఐదు జీడిపప్పులు తీసుకుని విడి విడిగా వాటర్‌లో రాత్రంతా నాన బెట్టుకోవాలి.
ఉదయాన్నే నీటిని తొలగించి బాదం పప్పుకు ఉన్న పొట్టును తీసేయాలి.ఇప్పుడు మిక్సీ జార్‌లో ఒక కప్పు ఫ్రెష్‌గా ఉన్న కమలా పండు తొక్కలు, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, అర కప్పు రోజ్ వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసి.
జ్యూస్‌ను మాత్రం వేరు చేసుకోవాలి. """/" /
ఆ తర్వాత ఒక బౌల్‌లో మూడు స్పూన్లు తయారు చేసుకున్న జ్యూస్, రెండు స్పూన్లు అలోవెర జెల్, రెండు స్పూన్లు ఫ్రెష్ క్రీమ్, ఒక స్పూన్ బాదం ఆయిల్ వేసి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకుంటే క్రీమ్ సిద్ధమైనట్టే.
ఈ క్రీమ్‌ను ఒక గాజు డబ్బులో నింపుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే గనుక పది రోజుల పాటు వాడుకోవచ్చు.
"""/" /
ఇక రాత్రి నిద్రించే ముందు ఫేస్ వాష్ చేసుకుని.అపై ఈ క్రీమ్‌ను అప్లై చేసి పడుకోవాలి.
ఇలా ప్రతి రోజూ చేస్తే ముఖంపై ఎటువంటి మచ్చలు ఉన్నా, ముడతలు ఉన్నా క్రమంగా తగ్గు ముఖం పడతాయి.