బ‌రువు పెర‌గ‌డం కోసం ఆరాట‌పడుతున్నారా? అయితే ఈ డ్రింక్ మీకోస‌మే!

శ‌రీర బ‌రువు ఎక్కువ‌గా ఉన్నా, త‌క్కువ‌గా ఉన్నా.రెండు ప్ర‌మాద‌క‌ర‌మే.

అందుకే బ‌రువు ఎక్కువ‌గా ఉంటే త‌గ్గ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు.అలాగే త‌క్కువ‌గా ఉన్న వారు పెర‌గ‌డానికి ఆరాట‌ప‌డుతుంటారు.

అయితే బ‌రువు పెర‌గ‌డం కోసం ఏవి ప‌డితే అవి తింటే.వెయిట్ గెయిన్ అవ్వ‌డం ఏమోగానీ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.

అందుకే స‌రైన ప‌ద్ధ‌తిలో ఆరోగ్యంగా బ‌రువు పెరిగేందుకు ప్ర‌య‌త్నించాలి.అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే డ్రింక్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి లేటెందుకు ఆ డ్రింక్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.

తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక‌టిన్న‌ర‌ గ్లాస్ కాచి చ‌ల్లార్చిన పాల‌ను తీసుకుని.

అందులో ప‌ది జీడిప‌ప్పులు, ఐదు పిస్తా ప‌ప్పులు, వ‌న్ టేబుల్ స్పూన్ గుమ్మ‌డి గింజ‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ పొద్దు తిరుగుడు విత్త‌నాలు, వ‌న్ టేబుల్ స్పూన్ పుచ్చ‌కాయ గింజ‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ రోస్ట్డ్ ఓట్స్ వేసి గంట పాటు నాన‌బెట్టుకోవాలి.

ఈలోపు ఒక మామిడి పండును తీసుకుని తొక్క తొల‌గించి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేస‌కోవాలి.

"""/" / ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్క‌లు, అన్నిటినీ వేసి నాన‌బెట్టుకున్న పాలు, ఐదారు ఖ‌ర్జూరాలు వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకుంటే.

డ్రింక్ సిద్ధం అవుతుంది.సూప‌ర్ టేస్టీగా ఉండే ఈ డ్రింక్ ను రోజుకు ఒక‌సారి తీసుకుంటే గ‌నుక బ‌రువు చ‌క్క‌గా పెరుగుతారు.

పైగా ఆరోగ్యానికి అవ‌స‌రం అయ్యే బోలెడ‌న్ని పోష‌కాలు ఈ డ్రింక్ ద్వారా పొందొచ్చు.

కాబ‌ట్టి, త‌ప్ప‌కుండా ఈ డ్రింక్‌ను తీసుకునేందుకు ప్ర‌య‌త్నించండి.అయితే మామిడి పండు బ‌దులుగా అర‌టి పండు, స్ట్రాబెర్రీస్‌, అవ‌కాడో, స‌పోటా వంటి పండ్ల‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు.

బ‌రువును పెంచ‌డానికి ఈ పండ్లు కూడా గ్రేట్ గా స‌హాయ‌ప‌డ‌తాయి.

వైరల్: రోడ్డుపై కారును పరుగులుపెట్టిస్తున్న మాజీ సీఎం..