ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఈ టీలు తాగితే..మస్తు బెనిఫిట్స్?
TeluguStop.com
ఓ బిడ్డకు జన్మనిచ్చే గొప్ప వరం కేవలం మహిళకు మాత్రం ఉంది.అందుకే వివాహమైన ప్రతి మహిళ గర్భం పొందాలని.
పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఎన్నో కలలు కంటుంది.అయితే ప్రెగ్రెన్సీ సమయం ఎంత మధురంగా ఉంటుందో.
అంతే క్లిష్టతరంగా కూడా ఉంటుంది.అందుకే ఆ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
తమకు, తమ కడుపులో పెరిగే బిడ్డకు మేలు చేసే ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి.
అలాగే కొన్ని ఆహారాలకు దూరంగా కూడా ఉండాలి.అయితే ప్రెగ్నెన్సీ సమయంలో టీ తాగ వద్దని చెబుతుంటారు.
కానీ, గర్భవతులకు కొన్ని కొన్ని టీలు ఎంతో మంచి చేస్తాయి.ఆ టీలు ఏంటీ అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి.
అయితే ఈ సమస్యలను నివారించడంలో సోంపు టీ అద్భుతంగా సహాయ పడుతుంది.రోజుకో కప్పు చొప్పున సోంపు తీసుకుంటే.
జీర్ణ సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. """/" /
అలాగే అల్లం టీ కూడా గర్భవతులకు చాలా మంచిది.
ప్రెగ్నెన్సీ సమయంలో తరచూ ఇబ్బంది పెట్టే వాంతులు, వికారం, ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలను అల్లం టీ సమర్థవంతంగా నివారిస్తుంది.
అయితే మంచిది కదా అని అధికంగా మాత్రం అల్లం టీని తీసుకోరాదు.వారంలో రెండు లేదా మూడు సార్లు ఒక కప్పు చొప్పున తీసుకుంటే మంచిది.
"""/" /
ప్రెగ్నెన్సీ సమయంలో తులసి టీ తీసు కోవడం కూడా ఎంతో మేలు.
గర్భవతులు తులసి ఆకులతో తయారు చేసిన టీ తీసుకోవడం వల్ల.అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది.
అలాగే ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఇబ్బంది పెట్టే జాయింట్ పెయిన్, మజిల్ పెయిన్స్ , బాడీ పెయిన్స్ నివారించడంలో తులసి టీ ఉపయోగపడుతుంది.
స్ట్రెస్ ను కూడా తగ్గిస్తుంది.అయితే ఈ టీ అతిగా మాత్రం తీసుకోరాదు.
ఇదిగో అమ్మాయిలు, ఈ టెక్నిక్ తెలిస్తే.. మిమ్మల్ని ఎవరూ వేధించలేరు!