బరువు తగ్గాలనుకుంటున్నవారికి బెస్ట్ స్మూతీ ఇది.. రోజు మార్నింగ్ తీసుకుంటే మరెన్నో లాభాలు!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అధిక బరువు సమస్యతో( Overweight Problem ) బాధపడుతున్నారు.

అధిక బ‌రువు అనేక రోగాలకు మూలం అవుతుంది.అలాగే శరీర ఆకృతి అందవిహీనంగా మారుతుంది.

అందమైన శరీర ఆకృతి కోసమే కాదు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా అధిక బరువు తగ్గించుకోవడం చాలా అవసరం.

అయితే బరువు తగ్గాలనుకుంటున్నవారికి ఇప్పుడు చెప్పబోయే స్మూతీ( Smoothie ) చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

రోజు మార్నింగ్ ఈ స్మూతీని కనుక తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందుతారు.

మరి ఇంతకీ ఆ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో అర కప్పు బీట్ రూట్ ముక్కలు( Beet Root Slices ), అర కప్పు క్యారెట్ ముక్కలు( Carrot Slices ), వ‌న్ టేబుల్ స్పూన్ అల్లం ముక్క‌లు మరియు కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో ఉడికించి చల్లార‌ పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అల్లుం ముక్క‌లు( Ginger Slices ) వేసుకోవాలి.

అలాగే ఒక గ్లాసు ఫ్రెష్ కొబ్బరి పాలు, మూడు నుంచి నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు సాల్ట్ మరియు మూడు ఐస్ క్యూబ్స్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.

దాంతో మన టేస్టీ అండ్ హెల్తీ బీట్ రూట్ క్యారెట్ స్మూతీ సిద్దమవుతుంది.

"""/" / ఈ స్మూతీ చాలా టేస్టీగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీని కనుక చేర్చుకుంటే ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది.

దీంతో తినడం తగ్గిస్తారు.ఫలితంగా బరువు తగ్గుతారు.

అలాగే ఈ స్మూతీలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ ( Iron, Folic Acid )రిచ్ గా ఉంటాయి.

అందువల్ల ఇది రక్తహీనతను దూరం చేస్తుంది. """/" / అంతే కాకుండా ఈ స్మూతీ లో ఉండే విటమిన్ సి( Vitamin C ) మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మన రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.

సీజనల్ గా వచ్చే వ్యాధులకు చెక్ పెడతాయి.ఈ స్మూతీలో ఉండే ఫైబర్ మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడంలో కూడా సహాయపడుతుంది.క్యారెట్ మరియు బీట్‌రూట్‌లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది.

ఇది మీ కంటి చూపును మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది.

ఫొటోలు వైర‌ల్: భ‌ర్త బాగుండలంటూ అట్లతద్ది పూజ‌ చేసిన స్నేహరెడ్డి..