గుండె జబ్బులు ఉన్నవారు ఖచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!
TeluguStop.com

నేటి ఆధునిక కాలంలో ఎందరో గుండె సంబంధిత జబ్బులతో బాధ పడుతున్నారు.కొందరు ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.


మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మద్యపానం, ధూమపానం, ఒత్తిడి, వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు, ఫాస్ట్ ఫుడ్స్ అతిగా తీసుకోవడం ఇలా రకరకాల కారణాల వల్ల గుండె జబ్బులు వస్తాయి.


ఇక గుండె జబ్బులు ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.అన్ని విషయాల్లో కేర్ తీసుకోవాలి.
ఒత్తిడి, ఆందోళన వంటి వాటికి దూరంగా ఉండాలి.సరైన ఆహారాన్ని తీసుకోవాలి.
ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాలను ఖచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె జబ్బుతో ఇబ్బంది పడే వారు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో ఏది పడితే అది తీసుకోరాదు.
వీరు ఓట్ మీల్ అల్పాహారంగా తీసుకోవడం చాలా మేలు.ఎందుకంటే, ఓట్స్‌లో ఉండే ఫైబర్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి.
మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.దాంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
"""/" /
అలాగే గుండె జబ్బుతో బాధ పడే వారు.ఖచ్చితంగా ప్రతి రోజు గుప్పెడు వాల్ నట్స్‌ను తీసుకోవాలి.
వాల్ నట్స్‌లో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు మోనో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు.
రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులు తొలగిస్తాయి.బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి.
మరియు గుండె పని తీరును మెరుగుపరుస్తాయి.వారంలో ఒకటి లేదా రెండు సార్లు చేపలు తీసుకోవాలి.
ఎందుకంటే, చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
చూడగానే ఆకర్షించే టమాటాలు కూడా గుండెకు ఎంతో మేలు చేస్తాయి.అందువల్ల, టమాటాలను కూడా తరచూ తీసుకోవాలి.
పండ్లలో యాపిల్, దానిమ్మ, అవోకాడో వంటివి ఎక్కువగా తీసుకోవాలి.ఇక వంటలకు ఏ నూనె పడితే ఆ నూనె కాకుండా.
ఆలివ్ ఆయిల్ వాడటం మేలు.అలాగే ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
వేపుళ్లు, ఫాస్ట్ ఫుడ్స్, ఫ్యాట్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
డాన్స్ మూవ్స్ తో మైఖేల్ జాక్సన్ నే మించిపోయాడుగా! వైరల్ వీడియో