రెగ్యుల‌ర్‌గా ఒత్తిడికి గుర‌వుతున్నారా? అయితే ఇవి ఖ‌చ్చితంగా తెలుసుకోండి!

ఒత్తిడి.నేటి టెక్నాల‌జీ యుగంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా ఎంద‌రినో మాన‌సికంగా క్షోభ‌పెడుతున్న స‌మ‌స్య ఇది.

ఒత్తిడి వినడానికి  చిన్న స‌మ‌స్య‌గానే అనిపించ‌వ‌చ్చు.కానీ, దీన్ని నిర్ల‌క్ష్యం చేస్తే ఎంత ఆరోగ్యంగా ఉన్న మ‌నిషి అయినా మంచాన ప‌ట్టాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది.

పైగా ఊబ‌కాయం, గుండె పోటు, మ‌ధుమేహం, ర‌క్త పోటు వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు ద‌రి చేర‌డానికి ఒత్తిడి ఒక ప్ర‌ధాన కార‌ణంగా నిపుణులు చెబుతుంటారు.

అందుకే ఒత్తిడికి ఎంత దూరంగా ఉంటే జీవితం అంత హాయిగా, ప్ర‌శాంతంగా ఉంటుంది.

అయితే కొంద‌రు రెగ్యుల‌ర్‌గా చిన్న చిన్న కార‌ణాల‌కు సైతం ఒత్తిడికి గుర‌వుతుంటారు.అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే మూడు ప‌దార్థాల‌ను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఒత్తిడి మీ ద‌రి దాపుల్లోకి రావ‌డానికి కూడా భ‌య‌ప‌డుతుంది.

మరి ఇంకెందుకు ఆల‌స్యం.ఏయే ప‌దార్థాల‌ను డైట్‌లో చేర్చుకోవాలో చూసేయండి.

కుంకుమ పువ్వు.అత్యంత ఖ‌రీదైన సుగంధ ద్రవ్యము.

ధ‌ర విష‌యం ప‌క్క‌న పెడితే కుంకుమ పువ్వులో బోలెడ‌న్ని అమోఘ‌మైన పోష‌కాలు నిండి ఉంటాయి.

ఇవి ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను నివారిస్తాయి.ముఖ్యంగా రోజూ చిటికెడు కుంకుమ పువ్వును తీసుకుంటే మెద‌డులో హ్యాపీ హార్మోన్లు రిలీజ‌వుతాయి.

ఫ‌లితంగా ఒత్తిడి త‌గ్గ‌డ‌మే కాదు.మ‌ళ్లీ మ‌ళ్లీ రాకుండా కూడా ఉంటుంది.

"""/" / మున‌గాకు.ముడు వంద‌ల‌ వ్యాధుల‌ను న‌యం చేసే శ‌క్తి దీనికి ఉంది.

అందుకే చాలా మంది మున‌గాకును విరి విరిగా వాడుతుంటారు.అయితే మున‌గాకును వారంలో మూడు నుంచి నాలుగు సార్లు ఏదో ఒక రూపంలో తీసుకుంటే.

అందులో ఉండే శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ మ‌న‌ల్ని త‌ర‌చూ ఒత్తిడికి గురికాకుండా ర‌క్షిస్తాయి.

అశ్వగంధ.కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని దీనిని పిలుస్తుంటారు.

అపార‌మైన ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉండే అశ్వ‌గంధ పొడిని రోజుకు ఒక గ్రాము చొప్పున తీసుకుంటే ఒత్తిడి అనే స‌మ‌స్యే మీకు ఉండ‌దు.

కూటమి పార్టీల్లో క్రాస్ ఓటింగ్ భయం ?