ఈ ముగ్గురు హీరోయిన్స్ మాత్రమే నెలకొల్పిన రికార్డు ఏంటో తెలుసా ?

అద్బుతాలు ఎప్పుడు జరగవు.అవి జరిగినప్పుడు మనం గుర్తించం.

కానీ ఏది ఎలా జరగాలో అది అలాగే జరుగుతుంది.ఒక నటికి ఇండస్ట్రీలో అవార్డులు, రివార్డులు దక్కడం సహజమే.

అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే హీరోయిన్స్ మాత్రం ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు.

ఆ హీరోయిన్స్ మరెవరో కాదు జయలలిత, రేవతి, సమంత.ఈ ముగ్గురు వేరు వేరు తరానికి చెందిన నటీమణులు కదా మరి వీరి ముగ్గురు ఎలాంటి రికార్డును నెలకొల్పారు అనే కదా మీ ప్రశ్న.

ఆ విషయం గురించి ఈ ఆర్టికల్ లో పూర్తిగా తెలుసుకుందాం.తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీలో జయలలిత,రేవతి, సమంత బాగా పేరు సంపాదించుకున్న హీరోయిన్స్.

ఒక్కోక్కరిది ఒక్కోతరం, జయలలిత 80లలో బిజీ హీరోయిన్ గా ఉంటే రేవతి 90లలో రేవతి హీరోయిన్ గా బిజీ గా ఉంది.

ఇక సమంత 2010 నుంచి బిజీ హీరోయిన్ గా ఉంటూ వస్తుంది.అయితే ఈ ముగ్గురు నటీమణులు మాత్రమే నెలకొల్పిన ఆ రికార్డు విషయానికొస్తే తమిళ మరియు తెలుగు భాషలో ఏకకాలంలో బెస్ట్ ఫిలింఫేర్ అవార్డు దక్కించుకున్నారు.

"""/" / జయలలిత 1973లో తమిళ మరియు తెలుగు భాషల్లో బెస్ట్ ఫిలింఫేర్ అవార్డు అందుకోగా తెలుగులో శ్రీకృష్ణసత్య అనే చిత్రానికి గాను ఆమెకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకుంది.

అలాగే అదే సంవత్సరం సూర్య గంధి అనే తమిళ సినిమాకు సైతం ఆమె బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది.

ఇక నటి రేవతి సైతం 1990లో ఆమె నటించిన రెండు సినిమాలకు గాను ఫిలింఫేర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా అవార్డు దక్కించుకుంది.

అది ఒకటి తమిళ సినిమా కాగా మరొకటి తెలుగు సినిమా.ఇక సమంత విషయానికొస్తే ఈగ తెలుగు వర్షన్ కి అలాగే తమిళ వర్షన్ కి కూడా ఆమె ఒకే ఏడాది రెండు ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ యాక్టర్స్ గా అవార్డు అందుకొని హీరోయిన్స్ లో రెండవ హీరోయిన్ గా రికార్డు ఎక్కింది.

ఆ పండుగను టార్గెట్ చేసిన ఎన్టీఆర్.. తారక్ ప్రశాంత్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?