కాంతార మూవీకి ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టికి అవార్డ్ .. ఈ నటుడికి ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా తక్కువే!

2022 సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీన కర్ణాటక రాష్ట్రంలో( Karnataka ) 250 థియేటర్లలో విడుదలై కాంతార మూవీ( Kantara Movie ) సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.

ఆ తర్వాత ఇతర భాషల్లో కాంతార మూవీ డబ్ అయ్యి ఇతర భాషల్లో సైతం హిట్ గా నిలిచింది.

కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది అంటే ఈ సినిమా ప్రేక్షకులకు ఏ స్థాయిలో నచ్చిందో సులువుగా అర్థమవుతుంది.

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులకు ఎంతగానో నచ్చింది.

కేంద్రం 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించగా ఉత్తమ నటుడి పురస్కారం కాంతార సినిమాకు గాను రిషబ్ శెట్టికి దక్కింది.

రిషబ్ శెట్టికి ఈ పురస్కారం దక్కడం సినీ అభిమానులను ఎంతో సంతోషానికి గురిచేసింది.

అయితే రిషబ్ శెట్టికు( Rishabh Shetty ) ఈ సక్సెస్ సులువుగా దక్కలేదు.

జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న ఈ నటుడు ఒకప్పుడు మినరల్ వాటర్ అమ్మారు.

"""/" / ఒకప్పుడు అప్పు ఇచ్చినవాళ్లు ఎక్కడ గొడవ చేస్తారో అని మారువేషాల్లో తిరిగిన రిషబ్ శెట్టి కర్ణాటక రాష్ట్రంలోని కెరాడి అనే పల్లెటూర్లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.

డిగ్రీ పూర్తి కాకముందే ఫిలిం ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో షేర్ అండ్ రిషబ్ శెట్టి ఆ సమయంలో ఆర్థికంగా ఎవరిపై ఆధారపడకూడదని భావించి మినరల్ వాటర్ బిజినెస్ మొదలుపెట్టారు.

"""/" / మొదట సైనైడ్ సినిమాకు( Cyanide ) అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరిన రిషబ్ శెట్టి ఆ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో ఇబ్బంది పడ్డారు.

ఆ తర్వాత గండ హెండతి సినిమాకు క్లాప్ బాయ్ గా చేరారు.ఆ సినిమాకు ఏడాది పని చేస్తే రిషబ్ కు కేవలం 1500 రూపాయలు వేతనంగా దక్కింది.

కిరిక్ పార్టీ అనే సినిమాతో తొలి సక్సెస్ అందుకున్న రిషబ్ శెట్టి ఆ తర్వాత వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగించారు.

అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమాలలో నటిస్తూ రిషబ్ విజయాలను అందుకుంటున్నారు.ప్రస్తుతం కాంతార2 సినిమాతో బిజీగా ఉన్న ఈ హీరో రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను, అవార్డులను అందుకోవాలని ఆకాంక్షిద్దాం.

రిషబ్ శెట్టికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

‘బస్సుల్లో డ్యాన్సులు ‘ స్పందించిన కేటీఆర్