ఈ బైక్ ట్యాక్సీ రైడర్ నెలకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..
TeluguStop.com
నిరుద్యోగులకు ఫుడ్ డెలివరీ, టాక్సీ సర్వీస్‌లు చాలా అవకాశాలను అందిస్తున్నాయి.మంచి రైడింగ్ లేదా డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నవారు ఇక్కడ జాయిన్ అయిపోయి వెంటనే డబ్బులు సంపాదించడం మొదలు పెట్టొచ్చు.
కానీ వీటిలో రైడర్ గా ఎంత డబ్బులు వస్తాయి అనేది మిగతా వారందరికీ అందంగా ఉంటుంది.
వీరి డౌట్స్ క్లియర్ చేసేందుకు ఆల్రెడీ ఆ సంస్థల్లో పనిచేస్తున్న వారు తమ శాలరీలను బయటపెడుతుంటారు.
తాజాగా ఒక రైడర్( Rider ) కూడా మంత్లీ ఇన్‌కమ్ రివిల్ చేశాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో అతనికి సంబంధించిన వీడియో చాలా వైరల్ అవుతోంది.
"""/" /
ఈ వీడియోలో, బెంగళూరులో( Bengaluru ) ఒక యువకుడు ఉబర్,( Uber ) ర్యాపిడో( Rapido ) వంటి బైక్ ట్యాక్సీలు నడుపుకుంటూ నెలకు రూ.
80,000 నుంచి 85,000 వరకు సంపాదిస్తున్నానని చెప్పాడు.రోజుకి 13 గంటల పాటు పని చేస్తే ఇంత సంపాదించవచ్చని చెప్పాడు.
ఇది విన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు.ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థల్లో, ఏసీ గదిలో పని చేసే వారికి కూడా ఇంత ఆదాయం రావడం కష్టంగా ఉంది.
నెలకి రూ.50,000 కంటే ఎక్కువ శాలరీ రావడమే కష్టంగా మారింది.
బాగా చదువుకుంటే తప్ప ఇంత సంపాదించడం కష్టం కానీ బైక్ ట్యాక్సీ రైడర్లు( Bike Taxi Riders ) ఈ అభిప్రాయం తప్పు అని నిరూపిస్తున్నారు.
"""/" /
ఈ వీడియోను 2024, డిసెంబర్ 4న @karnatakaportf అనే యూజర్ నేమ్ తో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంది.ఈ వీడియోను 6 లక్షల మందికి పైగా చూశారు.
3 వేలకు పైగా లైక్‌లు కూడా వచ్చాయి.చాలామంది ఈ వీడియో కింద కామెంట్లు చేశారు.
కొంతమంది ఆ డ్రైవర్ ఎంత కష్టపడుతున్నాడో చెప్పి ఆయన్ని ప్రశంసించారు.మరికొంతమంది రోజుకి 13 గంటలు బైక్ నడపడం చాలా కష్టమని అన్నారు.
ఒకరు "కష్టపడితే ఫలితం ఉంటుంది" అని కామెంట్ చేశారు.అయితే అందరూ రైడర్లు ఈ రేంజ్ లో డబ్బులు సంపాదిస్తారని చెప్పలేం.
కొంతమంది చెబుతున్న ప్రకారం జాయిన్ అయిన కొత్తలో రైడర్లకు ఎక్కువ ఇన్సెంటివ్స్, ఎక్కువ రైడ్స్ వస్తాయి కొద్ది రోజుల తర్వాత ఇవన్నీ తగ్గిపోతాయి.
రైడ్స్ కూడా ఎక్కువగా రావు దీనివల్ల ఎర్నింగ్స్ బాగా పడిపోతాయి.ఇక కమిషన్ కూడా ఎక్కువగానే కట్ అయిపోతుంది.
టాక్స్ లు కూడా చెల్లించాల్సి వస్తుంది.కానీ ఇవన్నీ తట్టుకొని ఈ రైడర్‌లా బాగా కష్టపడితే ఎవరైనా మంచి ఇన్‌కమ్ సంపాదించవచ్చు అని తెలుస్తోంది.
ఈ ఆయిల్ ను వాడితే పురుషులకు బట్టతల భయమే అక్కర్లేదు!