ఇంత టాలెంటెడ్‌గా ఉన్నవేంటి భయ్యా.. జొమాటోకే దమ్‌కీ ఇచ్చిన టెక్కీ..!
TeluguStop.com
ఇటీవల కాలంలో ఫుడ్ డెలివరీ కంపెనీలు ప్రజలకు దగ్గరయ్యాయి.ఈ సంస్థలు నేరుగా కస్టమర్ల ఇంటి ముంగట ఫుడ్ డెలివరీ( Food Delivery ) చేస్తున్నాయి.
అయితే ఈ సంస్థల సేవలు మెరుగుపడాల్సిన అవసరం ఉంది.ముఖ్యంగా కస్టమర్లను ఈ కంపెనీలు దోపిడీ చేస్తున్నాయని చాలామంది విమర్శలు చేస్తున్నారు.
ఉదాహరణకి జొమాటో( Zomato ) మెనూ ధర హోటల్ మెనూ ధర కంటే ఎక్కువగా ఉంటుంది.
అలానే డెలివరీ ఫీజు, ప్లాట్‌ఫామ్ ఫీజు అంటూ చాలా మనీ కాజేస్తారు.కొన్నిసార్లు సమయానికి ఫుడ్ డెలివరీ చేయరు.
దీనివల్ల కస్టమర్లు చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తారు.అయితే ఎప్పుడూ కస్టమర్లను ఏడిపించే జొమాటోను ఈసారి తానే ఏడిపించాలని బెంగళూరుకు( Bengaluru ) చెందిన ఒక టెక్కీ డిసైడ్ అయ్యాడు.
అంతేకాదు జొమాటోని ముప్పుతిప్పలు పెట్టి కస్టమర్లు కూడా ఈ సంస్థపై ప్రతీకారం తీర్చుకోవచ్చని నిరూపించాడు.
వివరాల్లోకి వెళితే, ఇటీవల సన్నీ గుప్తా( Sunny Gupta ) అనే యువకుడు ముంబై నుంచి పూణే వెళ్లే రైలులో ప్రయాణం మొదలుపెట్టాడు.
ఆ రైలులో క్యాంటీన్ సదుపాయం ఉన్నప్పటికీ, సన్నీ జొమాటో సేవనే ఎంచుకున్నాడు.ఇటీవలే జొమాటో ట్రైన్‌లో ఫుడ్ డెలివరీ చేసే సర్వీస్‌ను ప్రారంభించింది.
ఆ విషయం తెలిసిన సన్నీ జొమాటో యాప్‌లో ముందుగా ప్యాసింజర్ టిక్కెట్ నంబర్ (PNR)ని ఎంటర్ చేసి “ట్రిపుల్ స్చెజ్వాన్ రైస్”( Triple Schezwan Rice ) ఆర్డర్ చేశాడు.
"""/" /
వాస్తవానికి జర్నీకి నాలుగు రోజుల ముందుగానే జొమాటోలో ఆర్డర్‌ను బుక్ చేసుకోవచ్చు.
అంతేకాదు, ఫుడ్ ప్రిపరేషన్ మొదలయ్యే ముందు ఎప్పుడైనా ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసుకోవచ్చు.సన్నీ తన ఆహారాన్ని పన్వెల్ స్టేషన్‌లో తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
అయితే, సన్నీ ప్రయాణిస్తున్న రైలు కొంచెం ఆలస్యమైంది.రైలు ఆలస్యమైనా, జొమాటో వాళ్లు సన్నీ ఆర్డర్ చేసిన ఆహారాన్ని పన్వెల్ స్టేషన్‌లో సిద్ధంగా ఉంచారు.
ఈ విషయం తెలుసుకున్న సన్నీ చాలా సంతోషించి, “నా కోసం జొమాటో ఎదురు చూడటం ఇదే మొదటిసారి!, ఎప్పుడు ఆ సంస్థ డెలివరీ బాయ్ కోసం నేను ఎదురు చూసేవాన్ని.
"""/" /
డెలివరీ బాయ్ రన్నింగ్ లేట్ అంటూ నన్ను డిసప్పాయింట్ చేసేవారు కానీ ఇప్పుడు నేను ఆలస్యంగా వస్తున్నాను అని చెప్పి స్వీట్ రివెంజ్ తీర్చుకున్నాను.
” అని వ్యాఖ్యానించాడు."ఇలా వెయిట్ చేయించినందుకు చింతిస్తున్నాను.
తదుపరి ఆర్డర్‌లో 50 రూపాయలు ఎక్కువగా టిప్ ఇస్తాలే" అంటూ జొమాటోకి దమ్‌కీ ఇచ్చేసాడు కూడా.
చివరికి “ట్రిపుల్ స్చెజ్వాన్ రైస్”ని డెలివరీ బాయ్ సన్నీకి మర్యాదగా అందించాడు.జొమాటో సర్వీస్ తొలిసారి తనుకు నచ్చిందని సన్నీ పేర్కొన్నాడు.
అయితే, ఆ రెస్టారెంట్ ఆహారంతో పాటు స్పూన్స్ పంపలేదు.సన్నీ ఆ ఫుడ్ ఫోటో తీసి, అది తనకు సరిపోతుందని, కానీ రెస్టారెంట్ వాళ్లు స్పూన్లు ఇస్తే బాగుంటుందన్నాడు.
సన్నీ ట్వీట్ థ్రెడ్ వైరల్ అయింది.చాలామంది జొమాటో సర్వీస్‌ను మెచ్చుకున్నారు.
కొంతమంది మాత్రం, సన్నీ వెంటనే డెలివరీ ఏజెంట్‌కు టిప్ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.
మంచు మనోజ్ పై దాడి చేసిన మోహన్ బాబు… భగ్గుమన్న విభేదాలు!