హేమను అరెస్టు చేయొద్దు.. పోలీసుల పై ఒత్తిడి..తెర వెనుక ఏం జరుగుతుంది?

ఇటీవల బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీకి( Rave Party ) సంబంధించిన విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.

హైదరాబాద్ కి చెందిన వాసు అనే బిల్డర్ బెంగళూరులోని ఒక ఫామ్ హౌస్ లో తన పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఈ పార్టీని నిర్వహించారు అయితే ఈ పార్టీలో డ్రగ్స్( Drugs ) భారీ స్థాయిలో వినియోగిస్తున్నారనే విషయం పోలీసులకు తెలియడంతో పోలీసులు ఈ ఫామ్ హౌస్ పై దాడి చేశారు.

అయితే ఇందులో భాగంగా 100 మంది పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. """/" / ఇక ఈ పార్టీలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు బుల్లితెర సెలబ్రిటీలు కూడా ఉన్నారని పోలీసుల వెల్లడించారు.

అయితే టాలీవుడ్ సెలబ్రిటీలలో ప్రధానంగా సినీనటి హేమ( Hema ) పేరు వినిపిస్తోంది.

ఇక ఈమెకు పోలీసులు బ్లడ్ శాంపుల్ టెస్ట్ కి కూడా పంపించగా టెస్ట్ కూడా పాజిటివ్ రావడంతో ఈమె డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు.

ఇకపోతే నేడు (మే 27) విచారణకు రావాలని పోలీసులు తనకు నోటీసులు పంపినప్పటికీ హేమ మాత్రం విచారణకు హాజరు కాలేదు.

"""/" / ఇలా హేమ విచారణకు హాజరు కాకపోవడమే కాకుండా తనని అరెస్టు చేయకూడదు అంటూ ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ నాయకులతో( Political Leaders ) తరచూ బెంగుళూరు పోలీసులకు ఫోన్లు చేయిస్తూ పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారని తెలుస్తుంది.

ఇలా రాజకీయ నాయకుల చేత పోలీసులకు ఫోన్ చేయిస్తూ తన అరెస్టును అడ్డుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు కన్నడ మీడియాలో వార్తలు కూడా కోడై కూస్తున్నాయి.

మరి ఈ డ్రగ్స్ కేసు విషయంలో హేమ పరిస్థితి ఎటు దారితీస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

ట్రంప్ దెబ్బకి అమెరికా ఇలా అవుతుందా? నైక్, టెస్లా ఫ్యాక్టరీల్లో ‘బానిసల్లా’ అమెరికన్లు.. AI ఊహకు షాక్!