డబ్బు కోసం తల్లిదండ్రులను హత్య చేసిన కసాయి కొడుకు..!
TeluguStop.com
జల్సాలకు అలవాటు పడిన యువకుడు డబ్బు కోసం తల్లిదండ్రులను తెగ హింసించేవాడు.అయితే ప్రతి దానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది.
అందుకే ఆ తల్లిదండ్రులు కుమారుడి భవిష్యత్తు పాడు అవుతుందని డబ్బులు ఇచ్చేందుకు ససేమిరా అన్నారు.
క్షణిక ఆవేశంలో ఆ యువకుడు తల్లిదండ్రులపై ఇనుప రాడ్డుతో( Iron Rod ) అత్యంత దారుణంగా దాడి చేసి హత్య చేసిన ఘటన బెంగుళూరులోని( Bangalore ) యశ్వంత పుర చోటుచేసుకుంది.
"""/" /
వివరాల్లోకెళితే.మంగళూరుకు చెందిన భాస్కర్ కుటుంబం 12 ఏళ్ల క్రితం బెంగుళూరులోని యశ్వంత పుర పరిధిలో ఉండే బ్యాటరాయనపుర లో నివాసం ఉంటుంది.
భాస్కర్ (63)( Bhaskar ) ఒక హోటల్లో క్యాషియర్ గా పనిచేస్తున్నాడు.ఇతని భార్య శాంత (61) ( Shanta ) కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసి ఈ మధ్యనే రిటైర్డ్ అయింది.
ఈ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం.పెద్ద కుమారుడు ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.
చిన్న కుమారుడు శరత్( Sarath ) అప్పుడప్పుడు సైకోలా ప్రవర్తిస్తూ మద్యానికి బానిస అయ్యి బాధ్యత రహితంగా తిరుగుతూ ఉంటాడు.
"""/" /
సోమవారం అర్ధరాత్రి శరత్ పీకలదాకా మద్యం తాగి వచ్చి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులతో గొడవకు దిగాడు.
తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులను చితకబాది పక్కనే ఉన్న ఇనుప రాడ్డుతో తల్లిదండ్రుల తలపై దాడి చేశాడు.
క్షణాల్లో తల్లిదండ్రులు రక్తపు మడుగులోకి జారి ప్రాణాలు విడిచారు.అనంతరం శరత్ ఇంటికి తాళం వేసి పారిపోయాడు.
మంగళవారం ఉదయం పెద్ద కుమారుడు తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే ఎవరు స్పందించలేదు.వెంటనే పెద్ద కుమారుడు పక్కింటి వాళ్లకు ఫోన్ చేసి ఏం జరిగింది అని విచారించగా తన తల్లిదండ్రులు ఇద్దరు హత్యకు గురైనట్లు బయటపడింది.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, నిందితుడైన శరత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నటిస్తున్న మలయాళం స్టార్ హీరో…