Mainak Banerjee : ఆ పోలీస్ నా భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడు.. నటుడి సంచలన ఆరోపణలు వైరల్!

ఇటీవల కాలంలో సెలబ్రిటీలకు విమానాశ్రయాలలో ఒకరి తర్వాత ఒకరికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.

మరి ముఖ్యంగా హీరోయిన్ లకు ఎక్కువగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.తాజాగా మరో సెలబ్రిటీకి కూడా చేదు అనుభవం ఎదురయ్యింది.

ఆయన మరెవరో కాదు ప్రముఖ బెంగాలీ నటుడు మైనాక్ బెనర్జీకి( Bengali Actor Mainak Banerjee ) చేదు అనుభవం ఎదురైంది.

విమానాశ్రయం లో అతని భార్యను రిసీవ్ చేసుకోవడానికి వెళ్లగా అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది గొడవ పెట్టుకున్నారట.

"""/" / కోల్‌కతాలోని( Kolkata ) నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తాజాగా ఈ సంఘటన జరిగింది.

అయితే గొడవకు సంబంధించి ఫేస్‌బుక్‌ లైవ్‌లో మొత్తం ఎపిసోడ్‌ను వివరించాడు బెనర్జీ.తర్వాత బెనర్జీ మాట్లాడుతూ.

నా భార్య చెన్నై నుంచి విమానాశ్రయానికి వచ్చింది.ఆమె కోసం కారు తీసుకుని గేట్ వద్దకు వెళ్లాను.

అయితే నా వాహనాన్ని అక్కడి నుంచి తొలగించాలని పోలీసు నాకు చెప్పాడు.అక్కడే చాలా వాహనాలు ఉన్నాయని అయితే పోలీసులు వారిలో ఎవరికీ చెప్పలేదు.

"""/" / అంతేకాకుండా నా భార్యతో అసభ్యంగా ప్రవర్తించారు.అందుకే నేను కారు నుంచి దిగాల్సి వచ్చింది అని తెలిపారు బెనర్జీ.

ఇందుకు సంబందించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు బెనర్జీ కి మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు బెనర్జీ పై నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఇటీవల కాలంలో సెలబ్రిటీలకు ఇలాంటి చేదు అనుభవాలు ఎక్కువగా ఎదురవుతున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్25, బుధవారం 2024