జుట్టుకు విట‌మిన్ ఇ ఆయిల్ వ‌ల్ల ప్ర‌యోజ‌నాలేంటి.. ఈ నూనెను ఎలా వాడాలి..?

జుట్టు ఒత్తుగా, పొడుగ్గా మరియు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.ఈ నేపథ్యంలోనే అటువంటి జుట్టు కోసం రకరకాల హెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు.

అయితే జుట్టు సంరక్షణకు సహాయపడే ఆయిల్స్ లో విటమిన్ ఇ ఆయిల్( Vitamin E Oil ) కూడా ఒకటి.

కానీ చాలా మందికి విటమిన్ ఇ ఆయిల్ పై పెద్దగా అవగాహన లేదు.

అసలు విటమిన్ ఇ ఆయిల్ వల్ల జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి.? విటమిన్ ఇ ఆయిల్ ను ఎలా వాడాలి.

? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. """/" / విటమిన్ ఇ ఆయిల్‌ సహజ యాంటీ ఆక్సిడెంట్స్ ను కలిగి ఉంటాయి.

ఇవి జుట్టు పెరుగుదలను నిర్వహించడంలో సహాయపడ‌తాయి.ఆరోగ్య‌మైన జుట్టుకు మ‌ద్ధ‌తు ఇస్తాయి.

ఆక్సీకరణ ఒత్తిడి మరియు ఫ్రీ రాడికల్స్ పరిమాణాన్ని తగ్గించడంలో తోడ్ప‌డ‌తాయి.అలాగే విట‌మిన్ ఇ ఆయిల్ స్కాల్ప్ ఆరోగ్యాన్ని పెంచుతుంది.

హెయిర్ ఫాల్ ను అడ్డుకుంటుంది.కురుల‌ను హైడ్రేట్ చేస్తుంది.

అంతేకాదు విటమిన్ ఇ ఆయిల్ త‌ల‌లో రక్త ప్రవాహాన్నిపెంచుతుంది.జుట్టు కుదుళ్ల‌ను బ‌ల‌ప‌రుస్తుంది.

"""/" / ఇక ఇప్పుడు విటమిన్ ఇ ఆయిల్ ను జుట్టుకు ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు విటమిన్ ఇ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్లు ఆల్మండ్ ఆయిల్‌ ( Almond Oil )మరియు రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా త‌యారు చేసుకున్న‌ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని రెండు గంటలు అనంతరం తల స్నానం చేయాలి.

అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ తేనె మ‌రియు రెండు టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కి అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం హెయిర్ వాష్ చేసుకోవాలి.

ఈ రెండిట్లో ఏ రెమెడీని పాటించిన కూడా పై ప్ర‌యోజ‌నాల‌న్నిటినీ పొంద‌వ‌చ్చు.