ముఖాన్ని య‌వ్వ‌నంగా మెరిపించే `విట‌మిన్ ఇ` ఆయిల్‌..ఎలా వాడాలంటే?

చ‌ర్మ ఆరోగ్యానికి కావాల్సిన అతి ముఖ్య‌మైన పోష‌కాల్లో `విట‌మిన్ ఇ` ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.

డ్రై స్కిన్‌ను నివారించ‌డంలోనూ, ముడ‌త‌ల‌ను పోగొట్ట‌డంలోనూ, చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా మెరిపించ‌డంలోనూ విట‌మిన్ ఇ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

అందుకే అన్ని సౌంద‌ర్య ఉత్ప‌త్తుల్లోనూ దీనిని కామ‌న్‌గా వాడ‌తారు.అలాగే విట‌మిన్ ఇ తో డైరెక్ట్‌గా ఫేస్ ప్యాక్స్ కూడా వేసుకోవ‌చ్చు.

విట‌మిన్ ఇ ఆయిల్ క్యాప్సూల్స్ దాదాపు అన్ని మిడిక‌ల్ షాప్స్‌లోనూ అందుబాటులో ఉంటాయి.

వాటిని తెచ్చుకుని స్కిన్‌ను యూజ్ చేసుకోవ‌చ్చు.అయితే విట‌మిన్ ఇ ఆయిల్‌ను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

"""/"/ ముందుగా బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ చంద‌నం పొడి, ఒక‌టిన్న‌ర స్పూన్ విట‌మిన్ ఇ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మానికి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నవ్వాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.రెండు రోజుల‌కు ఒక సారి ఇలా చేస్తే ముడత‌లు, న‌ల్ల‌టి మ‌చ్చ‌లు పోయి ముఖం య‌వ్వ‌నంగా మెరుస్తుంది.

అలాగే గిన్నెలో మూడు విట‌మిన్ ఇ క్యాప్సూల్స్ ఆయిల్‌, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

అపై ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి స‌ర్కిల‌ర్ మోష‌న్‌లో స్మూత్‌గా మ‌సాజ్ చేసుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే డ్రై స్కిన్ స‌మ‌స్య దూర‌మై.ముఖం గ్లోగా మ‌రియు స్మూత్‌గా మారుతుంది.

"""/"/ ఇక విట‌మిన్ ఇ ఆయిల్‌ను నేరుగా ముఖానికి, మెడ‌కు అప్లై చేసి ఐదారు నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.

అపై కాస్త డ్రై అవ్వ‌నిచ్చి కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజూ చేయ‌డం వ‌ల్ల డార్క్ స్పాట్స్ త‌గ్గుతాయి.

ట్యాన్ స‌మ‌స్య ఉండ‌దు.వృద్ధ‌ప్య ఛాయ‌లు త్వ‌ర‌గా రాకుండా ఉంటాయి.

మ‌రియు చ‌ర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది.

Chandrababu : కదిరి ప్రజాగళం సభలో చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!