టీ ట్రీ ఆయిల్‌తో ఇన్ని బెనిఫిట్సా? మరి మీరు వాడుతున్నారా?
TeluguStop.com
టీ ట్రీ ఆయిల్.ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్న సుగంధ తైలం.
అయితే చాలా మందికి టీ ట్రీ ఆయిల్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటీ? దీనిని ఎలా యూజ్ చేయాలి? అన్న విషయాలు తెలియకపోవచ్చు.
అలాంటి వారు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలుసుకోవాల్సిందే.సాధారణంగా ఈ టీ ట్రీ ఆయిల్ చర్మ సంరక్షణలోనూ, కేశ సంరక్షణలోనూ ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది.
అలాగే ఈ టీ ట్రీ ఆయిల్‌కు వాపులను నొప్పులను తగ్గించే సమార్థం కూడా ఉంది.
మరి ఈ ఆయిల్ ఏ ఏ విధంగా ఉపయోగించవచ్చో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
పొడి చర్మాన్ని నివారించడంలో ఈ టీ ట్రీ ఆయిల్ గ్రేట్‌గా సహాయపడుతుంది.
ఒక కప్పు నీటిలో రెండు, మూడు చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి.
దూది సాయంతో ముఖానికి అద్దుకోవాలి.పది నిమిషాల పాటు డ్రై అవ్వనిచ్చి.
ఆ తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే పొడి చర్మం తేమగా, మృదువుగా మరియు కాంతివతంగా మారుతుంది.
అంతేకాదు, ఇలా చేస్తే మొటిమలు సమస్య కూడా పరార్ అవుతుంది.అలాగే ఒక్కో సారి ఫంగస్ కారణంగా గోరుచుట్టు ఏర్పడుతుంది.
ఈ గోరుచుట్టు వచ్చిందంటే.ఎన్ని మందులు వాడినా ఓ పట్టాన తగ్గనే తగ్గదు.
అలాంటప్పుడు ఒక గ్లార్ గోరు వెచ్చని నీటితో తీసుకుని.అందులో ఒక స్పూన్ పసుపు మరియు రెండు చుక్కల టీ ట్రీ అయిల్ వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ నీటిలో వేలును పెట్టి ఉంచాలి.ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే గోరుచుట్టు తగ్గుతుంది.
అలాగే స్నానం చేసే నీటితో నాలుగైదు చుక్కలు టీ ట్రీ ఆయిల్ వేసి చేస్తే.
శరీరం నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.చర్మ అలెర్జీలు, చర్మం దురద పెట్టడం వంటి సమస్యలు దూరం అవుతాయి.
అంతేకాదు, నీటిలో టీ ట్రీ ఆయిల్ వేసి స్నానం చేయడం వల్ల శరీర వేడి తగ్గు ముఖం పడుతుంది.
"""/" /
ఇక చుండ్రు సమస్యతో బాధ పడే వారు.ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు స్పూన్ల పెరుగు, మూడు చుక్కల టీ ట్రీ ఆయిల్ మరియు ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి.
తలకు పట్టించాలి.ఇరవై నిమిషాల అనంతరం తలస్నానం చేయాలి.
ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు పోతుంది.
అక్కినేని అఖిల్ మామ చాలా రిచ్.. ఆస్తుల విలువ తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!