గ‌ర్భిణీలు ఉద‌యాన్నే పుదీనాను తీసుకుంటే..ఆ జ‌బ్బులు ప‌రార్‌!

ఆకు కూర‌ల్లో ఒక‌టైన పుదీనాను వంట‌ల్లో విరిగా విరిగా వాడుతుంటారు.ఏ వంట‌కైనా చ‌క్క‌ని రుచి, వాస‌న అందించే పుదీనాలో పోష‌కాలు కూడా మెండుగా ఉంటాయి.

విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, బి-కాంప్లెక్స్, కాల్షియం, ఐర‌న్‌, ఫాస్ప‌ర‌స్‌, మాంగనీస్, ప్రోటీన్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూటియెంట్స్ ఇలా ఎన్నో పోషక విల‌వ‌లు పుదీనాలో నిండి ఉంటాయి.

అందుకే పుదీనాను త‌ర‌చూ తీసుకోమ‌ని నిపుణులు చెబుతుంటారు.అయితే సామాన్యుల‌కే కాదు గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు కూడా పుదీనా ఎంతో మంచిది.

ముఖ్యంగా గ‌ర్భిణీలు ఉద‌యాన్నే పుదీనాను తీసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.సాధార‌ణంగా ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో మ‌హిళ‌లు వికారం, వాంతులు స‌మ‌స్య‌ల‌తో త‌ర‌చూ ఇబ్బంది ప‌డుతూ ఉంటాయి.

అయితే కొన్ని ఫ్రెష్‌గా ఉండే పుదీనా ఆకుల‌ను తీసుకుని క్ర‌ష్ చేసి వాట‌ర్‌లో వేసి బాగా మ‌రిగించాలి.

ఈ వాట‌ర్‌ను వ‌డ‌బోసి కొద్దిగా తేనె క‌లిపి తీసుకోవాలి.ఉద‌యాన్నే గ‌ర్భిణీలు ఈ పుదీనా వాట‌ర్ తీసుకుంటే వాంతులు త‌గ్గుతాయి.

వికారం స‌మ‌స్య దూరం అవుతుంది. """/"/ అలాగే గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు చాలా మందిని ర‌క్త హీన‌త స‌మ‌స్య వేధిస్తుంది.

అయితే ఉద‌యాన్నే పుదీనా ఆకుల‌తో త‌యారు చేసిన జ్యూస్‌ను తీసుకుంటే అందులో పుష్క‌లంగా ఉండే ఐర‌న్ ర‌క్త వృద్ధి జ‌రిగేందుకు స‌హాయ‌ప‌డుతుంది.

దాంతో ర‌క్త హీన‌త దూరం అవుతంది.ఇక ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య కూడా త‌ర‌చూ ఇబ్బంది పెడుతుంది.

అయితే పుదీనా ఆకుల‌తో త‌యారు చేసిన టీని ఉద‌యాన్నే తీసుకోవాలి.ఇలా చేస్తే పుదీనాలు ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.

మ‌రియు మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య దూరం అవుతుంది.పుదీనా వాట‌ర్‌ను ఉద‌యాన్నే తీసుకుంటే గ‌ర్భిణీలు త‌ర‌చూ ఎదుర్కొనే నీర‌సం, అల‌స‌ట స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు.

అలాగే త‌ల‌నొప్పి, ఒత్తిడి వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.‌.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??