వేస‌విలో ఓ అర‌గంట స్విమ్మింగ్ చేస్తే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

చూస్తుండ‌గానే వేస‌వి కాలం వ‌చ్చేసింది.భానుడు భ‌గ‌భ‌గ‌మంటూ ప్ర‌జ‌ల‌పై నిప్పులు చెరుగుతున్నాడు.

మార్చి నెల కూడా ముగియక ముందే ఎండలు దంచి కొడుతుండ‌టంతో.ఆ వేడికి ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.

ఇక వేస‌విలో ఆరోగ్యాన్ని సంర‌క్షించుకోవ‌డం ఎంత క‌ష్ట‌త‌ర‌మో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్పాల్సిన ప‌ని లేదు.

ఏ మాత్రం ఏమ‌ర‌పాటుగా ఉన్నా ఏదో ఒక స‌మ‌స్య వ‌చ్చి ముప్పు తిప్ప‌లు పెట్టేస్తుంది.

అందుకే వేస‌విలో ఆరోగ్య ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాలి.శ‌రీరానికి మేలు చేసే ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలి.

వాట‌ర్ ఎక్కువ‌గా సేవించాలి.అలాగే వేస‌విలో స్విమ్మింగ్ హెల్త్‌కి ఎంతో మేలు చేస్తుంది.

అవును, ఈ సీజ‌న్‌లో రోజుకు ఓ అర గంట పాటు స్విమ్మింగ్ చేస్తే బోలెడ‌న్ని హెల్త్ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.సాధార‌ణంగా చాలా మంది వేస‌వి వేడి కార‌ణంగా వ్యాయామాల‌ను నిర్ల‌క్ష్యం చేసి బ‌రువు పెరుగుతుంటారు.

అలాంటి వారు ప్ర‌తి రోజు స్విమ్మింగ్ చేయాలి.త‌ద్వారా శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వంతా క‌రిగి బ‌రువు త‌గ్గుతారు.

"""/" / అలాగే వేస‌విలో త‌ర‌చూ ఇబ్బంది పెట్టే స‌మ‌స్య‌ల్లో త‌ల‌నొప్పి ఒక‌టి.

అయితే స్విమ్మింగ్ చేయడం వ‌ల్ల మ‌న‌సు, మెద‌డు ప్ర‌శాంతంగా మార‌తాయి.దాంతో త‌ల‌నొప్పి మాత్ర‌మే కాదు ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌ల‌న్నీ పరార్ అవుతాయి.

రోజుకు ఒక అర గంట స్విమ్మింగ్ చేస్తే రోజంతా యాక్టివ్‌గా, ఎన‌ర్జిటిక్‌గా ఉండొచ్చు.

నీర‌సం, అల‌స‌ట వంటివి ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.అంతే కాదు, వేస‌విలో ప్ర‌తి రోజు స్విమ్మింగ్ చేస్తే గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ త‌గ్గు ముఖం ప‌డుతుంది.

శ‌రీరంలో అధిక వేడి దూరం అవుతుంది.వేస‌వి వేడిని త‌ట్టుకునే శ‌క్తి ల‌భిస్తుంది.

మ‌రియు రాత్రుళ్లు మంచిగా నిద్ర సైతం ప‌డుతుంది.

ఇండస్ట్రీలో సెలబ్రెటీలపై రూమర్స్ పుట్టించేది వాళ్లే: సోనాలి బింద్రే