ఈ ఆయిల్ వాడితే.. హెయిర్ ఫాల్ స‌మ‌స్యే ఉండ‌ద‌ట‌!

హెయిర్ ఫాల్‌ఈ మ‌ధ్య కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మందిని ఇబ్బంది పెడుతున్న కామ‌న్ స‌మ‌స్య ఇది.

ఆహార‌పు అల‌వాట్లు, వాతావ‌ర‌ణంలో మార్పులు, పోష‌కాల లోపం, ప‌లు కెమిక‌ల్ ప్రోడెక్ట్స్ వాడ‌కం, కాలుష్యం, కేశాల విష‌యంలో స‌రైన శ్ర‌ద్ధ తీసుకోక‌పోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణంగా హెయిర్ ఫాల్‌కు గుర‌వుతుంటారు.

దీంతో ఈ స‌మ‌స్య‌ను ఎలా నివారించుకోవాలో తెలియ‌క‌.షాంపూలు, ఆయిల్స్ మారుస్తుంటారు.

అయిన‌ప్ప‌టికీ త‌గ్గ‌కుంటే మాన‌సికంగా కృంగిపోతుంటారు.అయితే హెయిర్ ఫాల్‌ను స‌మ‌ర్థ‌వంతంగా నివారించ‌డంలో సోయాబీన్ ఆయిల్ అద్భుతంగా స‌మాయ‌ప‌డుతుంది.

సోయా బీన్ ఆయిల్‌లో ఉండే ప్రోటీన్, విటమిన్ ఇ, రిబోఫ్లేవిన్ వంటి పోష‌కాలు జుట్టుకు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

మ‌రి ఇంత‌కీ సోయా బీన్ ఆయిల్‌ను కేశాల‌కు ఎలా వాడాలో అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు స్పూన్ల‌ సోయా బీన్ ఆయిల్‌ మ‌రియు ఒక స్పూన్ బాదం ఆయిల్‌ తీసుకుని బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు, కేశాల‌కు, కుదుళ్ల‌కు బాగా అప్లై చేసి రెండు గంట‌ల పాటు వ‌దిలేయాలి.

అనంతరం మామూలు షాంపు తో   త‌ల స్నానం చేయాలి.ఇలా మూడు రోజుల‌కు ఒక సారి చేస్తూ ఉంటే క్ర‌మంగా హెయిర్ ఫాల్ త‌గ్గు ముఖం ప‌డుతుంది.

అలాగే సోయా బీన్ ఆయిల్‌ను డైరెక్ట్ గా జుట్టుకు అప్లై చేసుకోవాలి.వారంలో రెండు సార్లు సోయా బీన్ ఆయిల్‌ను కేశాల‌కు అప్లై చేసి కాసేపు మాసాజ్ చేసుకుంటే  క్ర‌మంగా హెయిర్  ఫాల్ త‌గ్గు ముఖం ప‌డుతుంది.

జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెర‌గ‌డం స్టార్ట్ అవుతుంది.అంతేకాదు, చుండ్రు స‌మ‌స్య కూడా దూరం అవుతుంది.

ఆడవాళ్లు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది… అందుకు ఎవరు అతీతులు కాదు