దిండు లేకుండా నిద్రించ‌డం వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?

ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలంటే పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం.

దాదాపు 90 శాతం రోగాలకు సరైన నిద్ర లేకపోవడం కూడా ఒక కారణం.

నిద్రను నిర్లక్ష్యం చేస్తే ఒత్తిడి, అధిక బరువు, మధుమేహం, గుండె జబ్బులు( Diabetes , Heart Disease ), రక్తపోటు ఇలా ఎన్నో ఎన్నెన్నో సమస్యలు చుట్టుముడ‌తాయి.

అందుకే రోజుకు ఎనిమిది గంటల పాటు నిద్రించాలని నిపుణులు ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతుంటారు.ఇకపోతే నిద్రపోయే సమయంలో ఏమున్నా లేకపోయినా తల కింద దిండు మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే.

"""/" / మనలో చాలా మంది దిండు లేనిదే నిద్ర పోలేరు.కానీ దిండు లేకుండా నిద్రపోవడం వల్ల అనేక‌ ప్రయోజనాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు.

మరి ఆ ప్రయోజనాలు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.దిండు లేకుండా రాత్రుళ్లు నిద్ర పోవడం మీ మెడ మరియు వెన్నెముకను సమలేఖనం చేయడానికి సహాయపడుతుంది.

వెన్ను మరియు మెడ నొప్పి నుండి ఉపశమనం పొందుతారు. """/" / అలాగే దిండు లేకుండా పాడుకోవ‌డం వ‌ల్ల ముఖంపై త్వ‌ర‌గా ముడ‌త‌లు రాకుండా ఉంటాయి.

అవును, మీరు విన్న‌ది నిజ‌మే.దిండుపై పడుకోవడం వల్ల మీ చర్మంపై ఒత్తిడి పడుతుంది, ఇది కాలక్రమేణా ముడతలకు దారితీస్తుంది.

అందువ‌ల్ల ముడ‌త‌ల‌కు దూరంగా ఉండాల‌నుకుంటే దిండును ఎవైడ్ చేయండి.కొంద‌రికి ముఖంపై త‌ర‌చూ మొటిమ‌లు వ‌స్తుంటాయి.

ఇందుకు దిండుపై నిద్రించ‌డం కూడా ఒక కార‌ణం.మురికి దిండుల నుండి వృద్ధి చెందే బ్యాక్టీరియా మొటిమలు, మ‌చ్చ‌లు వంటి చర్మ స‌మ‌స్య‌ల‌కు కారణమవుతుంది.

కొంద‌రు ఉద‌యం లేవ‌డం లేవ‌డంతోనే త‌ల‌నొప్పి( Headache ) అని అంటుంటారు.అలాంటివారు దిండు లేకుండా నిద్రించ‌డానికి ప్రయత్నించండి.

దిండుతో నిద్రించడం వల్ల తలకు రక్త ప్రసరణ తగ్గుతుంది.ఇది తలనొప్పికి దారి తీస్తుంది.

అయితే దిండు లేకుండా నిద్రించ‌డం అనేది అంద‌రికీ అనుకూలంగా ఉండ‌క‌పోవ‌చ్చు.బ్యాక్ స్లీపర్స్‌, సైడ్ స్లీప‌ర్స్ దిండు లేకుండా నిద్రపోకూడదు.

దిండు లేకుండా నిద్రపోవడం వ‌ల్ల గురక మరియు స్లీప్ అప్నియా లక్షణాలు మరింత అధ్వాన్నంగా మార‌తాయి.

నాకు సంబంధం లేని విషయంలో నన్ను లాగొద్దు.. నాని సెన్సేషనల్ కామెంట్స్!