నువ్వుల నూనెతో ఇలా చేస్తే.. మొటిమలు, మ‌చ్చ‌లు దూరం!

మొటిమ‌లు, మ‌చ్చ‌లు చాలా మంది ఈ చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతుంటారు.ముఖం ఎంత తెల్లగా ఉన్నా.

మొటిమ‌లు, మ‌చ్చ‌లు ఉంటే అంద‌హీనంగానే క‌నిపిస్తారు.అందుకే మొటిమ‌లు, మ‌చ్చ‌లు వ‌చ్చాయంటే.

వాటిని ఎలా త‌గ్గించుకోవాలా అని తెగ హైరానా ప‌డిపోతుంటారు.టెన్ష‌న్ కూడా పెట్టేసుకుంటారు.

అయితే మొటిమలు, మ‌చ్చ‌లను త‌గ్గించ‌డంలో నువ్వుల నూనె అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి నువ్వుల నూనెను ఎలా చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్‌లో నువ్వుల నూనె, శెన‌గ పిండి మ‌రియు నిమ్మ ర‌సం మూడు తీసుకుని.

బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.

ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు ఆరిపోనివ్వాలి.ఆ త‌ర్వాత కోల్డ్ వాట‌ర్‌తో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇలా మూడు రోజుల‌కు ఒక‌సారి చేస్తే.మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

"""/" / అలాగే రెండొవ‌ది.ఒక బౌల్‌లో నువ్వుల నూనె, ఇంట్లో త‌యారు చేసుకున్న రోజ్ వాట‌ర్ రెండూ తీసుకుని.

బాగా క‌లుపుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.

అర గంట పాటు వ‌దిలేయాలి.ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేస్తే.మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గ‌డంతో పాటు ముఖం కాంతివంతంగా కూడా మారుతుంది.

ఇక మూడొవ‌ది.ఒక బౌల్‌లో నువ్వుల నూనె మ‌రియు కొబ్బ‌రి నూనె స‌మానంగా తీసుకుని.

మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.

బాగా ఆర‌నివ్వాలి.రాత్రి ప‌డుకునే ముందు ఇలా చేసి.

ఉద‌యం ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేయ‌డం మ‌చ్చ‌లు త‌గ్గుతాయి.

అలాగే చ‌ర్మం కూడా ఎల్ల‌ప్పుడు మృదువుగా మ‌రియు య‌వ్వ‌నంగా ఉంటుంది.

వీడియో వైరల్: గుర్రపు స్వారీ చేస్తూ కిందపడ్డ వ్యక్తి చివరకు..