నువ్వుల నూనెతో ఇలా చేస్తే.. మృదువైన చ‌ర్మం మీ సొంతం!

నువ్వుల నుంచి వ‌చ్చే నువ్వుల నూనెలో ఎన్నో పోష‌కాలు ఉన్నాయి.అందుకే వంట‌ల‌కు నువ్వుల నూనెను విరివిరిగా ఉప‌యోగిస్తుంటారు.

యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్స్‌, మిన‌ర‌ల్స్ పుష్క‌లంగా ఉంటాయి.ఇవి గుండె ఆరోగ్యానికి, మధుమేహ నివారణకు, ఎముకులు దృఢ‌ప‌డ‌టానికి ఇలా ఎన్నో విధాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

అలాగే చ‌ర్మ సౌంద‌ర్యాన్ని రెట్టింపు చేయ‌డంలోనూ నువ్వుల నూనె అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి నువ్వుల నూనె చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా నువ్వుల నూనె మ‌రియు రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు దీన్ని ముఖానికి అప్లై చేసి.కాసేపు మ‌సాజ్ చేసుకోవాలి.

బాగా ఆరిన త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల ముఖంపై ముడ‌త‌లు పోయి.

మృదువుగా, య‌వ్వ‌నంగా మారుతుంది.రెండొవ‌ది ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా నువ్వుల నూనె, ప‌సుపు మ‌రియు నిమ్మ ర‌సం వేసి బాగా క‌లుపుకోవాలి.

ఇప్ప‌డు దీన్ని ముఖానికి మ‌రియు మెడ‌కు అప్లై చేసి.ప‌ది నిమిషాలు లేదా ఇరవై నిమిషాల పాటు బాగా ఆర‌నివ్వాలి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు పోయి.

ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది.మూడొవ‌ది ఒక బౌల్‌లో కొద్దిగా నువ్వుల నూనె మ‌రియు బియ్యంపిండి తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి బాగా అప్లై చేసి.పావు గంట పాటు ఆర‌నివ్వాలి.

బాగా ఆరిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై మృత క‌ణాలు పోయి.

చ‌ర్మం మృదువుగా, ఫ్రెష్‌‌గా మారుతుంది.మ‌రియు ఈ ప్యాక్ వ‌ల్ల చ‌ర్మం రంగును మెరుగుప‌డుతుంది.

ఎంబీబీఎస్ ప్రవేశాలు.. ఎన్ఆర్ఐ కోటా నిబంధనల్ని సవరించిన పంజాబ్ సర్కార్