సగ్గుబియ్యంతో ఇలా చేస్తే జుట్టు వద్దన్నా పెరుగుతుంది.. తెలుసా?
TeluguStop.com
సగ్గుబియ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.వీటితో చాలా రకాల వంటలను తయారు చేస్తుంటారు.
అలాగే సగ్గుబియ్యంలో బోలెడన్ని పోషకాలు కూడా నిండి ఉండటం వల్ల.ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తాయి.
చర్మ సౌందర్యానికీ సగ్గుబియ్యాన్ని వాడుతుంటారు.అయితే ఆరోగ్య పరంగా, సౌందర్య పరంగానే కాదు.
కేశ సంరక్షణకు సైతం సగ్గుబియ్యం అద్భుతంగా సహాయపడతాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా సగ్గుబియ్యంను వాడితే జుట్టు వద్దన్నా పెరుగుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం అసలు మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం పదండీ.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం వేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు గరిటెతో తిప్పుకుంటూ ఉడికిస్తే.
జల్‌గా మారుతుంది.అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పల్చటి కాటన్ వస్త్రం సాయంతో జెల్‌ను సపరేట్ చేసుకోవాలి.
"""/"/
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో సగ్గుబియ్యం జెల్, మూడు టేబుల్ స్పూన్ల పెరుగు, వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి అన్ని కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ఈ మిశ్రమాన్ని పట్టించి షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.
గంట లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను యూజ్ చేసి తల స్నానం చేయాలి.
ఇలా వారంలో రెండంటే రెండు సార్లు చేస్తే గనుక జుట్టు కుదుళ్లకు బలం చేకూరుతుంది.
ఫలితంగా జుట్టు రాలడం తగ్గి.ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
చాలా మంది సిల్కీ హెయిర్ కోసం తెగ తాపత్రాయపడుతుంటారు.అలాంటి వారికి కూడా ఈ రెమెడీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది.
కాబట్టి, తప్పకుండా ట్రై చేయండి. .
టాలీవుడ్ డైరెక్టర్లను బుట్టలో వేస్తున్న బాలీవుడ్ హీరోలు…