ఇంట్లో రోజ్ వాట‌ర్ ఉందా..? అయితే వేస‌విలో మీ చ‌ర్మం ప‌దిలమే!

వేస‌వి కాలంలో అనారోగ్య స‌మ‌స్య‌లే కాదు.వివిధ ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌లు సైతం తీవ్రంగా స‌త‌మ‌తం చేస్తుంటాయి.

స‌న్ ట్యాన్, పొడి చ‌ర్మం, మొటిమ‌లు, చ‌ర్మం నిర్జీవంగా మార‌డం ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు మ‌ద‌న పెడుతూ ఉంటాయి.

అయితే ఇంట్లో రోజ్ వాట‌ర్ ఉంటే ఆ స‌మ‌స్య‌ల‌కు సుల‌భంగా చెక్ పెట్టి చ‌ర్మాన్ని ప‌దిలంగా కాపాడుకోవ‌చ్చు.

రోజ్ వాట‌ర్‌లో ఉండే సుగుణాలు ప్ర‌స్తుత స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో చ‌ర్మాన్ని ర‌క్షించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి లేటెందుకు రోజ్ వాట‌ర్‌ ను స్కిన్‌కు ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం ప‌దండీ.

స‌మ్మ‌ర్ సీజ‌న్‌లోనూ స్కిన్ అందంగా, గ్లోయింగ్‌గా మెరిసిపోవాలి అనుకుంటే.ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ కీర జ్యూస్‌, వ‌న్ టేబుల్ స్పూన్ పుచ్చ‌కాయ జ్యూస్‌, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాట‌ర్‌, రెండు టేబుల్ స్పూన్ల పాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్‌ పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసి.ఇర‌వై నిమిషాల పాటు వ‌దిలేయాలి.

ఆపై గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ రెమెడీని త‌ర‌చూ ట్రై చేస్తే స‌న్ ట్యాన్ స‌మ‌స్య వ‌దిలిపోతుంది.

నిర్జీవంగా ఉన్న‌ చ‌ర్మం మ‌ళ్లీ కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. """/" / అలాగే ప్ర‌స్తుత వేస‌వి కాలంలో రోజ్ వాట‌ర్ ను రోజుకు రెండు సార్లు ముఖానికి స్ప్రే చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం తాజాగా ఉంటుంది.ఎండ‌ల వ‌ల్ల‌ న‌ల్ల‌గా మారిన చ‌ర్మం తిరిగి పూర్వ రూపాన్ని పొందుతుంది.

డార్క్ స‌ర్కిల్స్ ఉన్నా క్ర‌మంగా త‌గ్గిపోతాయి.ఇక మొటిమ‌ల స‌మ‌స్య వేధిస్తుంటే.

రోజ్ వాట‌ర్‌, పుదీనా ర‌సం, ప‌సుపు మూడిటినీ క‌లిపి చ‌ర్మంపై అప్లై చేయాలి.

పూర్తిగా ఆరిన త‌ర్వాత వాట‌ర్‌తో శుభ్రం చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక‌సారి చేస్తే మొటిమ‌లే కాదు, వాటి తాలూకు మ‌చ్చ‌లు సైతం ప‌రార్ అవుతాయి.

అమెరికా : కాలిఫోర్నియాలో ఘనంగా ‘‘హిమాచలీ నైట్ ’’ , అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు