రోజూ పిల్లలకు కాస్త గంజి పట్టిస్తే ఏం అవుతుందో తెలుసా?
TeluguStop.com
అన్నం వండిన తర్వాత వచ్చే గంజిని ఇటీవల కాలంలో అందరూ బయటే పారబోసేస్తున్నారు.
కానీ, పూర్వం ఆ గంజితోనే చాలా మంది కడుపును నింపుకునేవారు.పైగా గంజి ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలను అందిస్తుంది.
అసలు అన్నం కంటే గంజిలోనే ఎక్కువ పోషక విలువలు నిండి ఉంటాయి.అందు వల్లనే రోజూ గంజి తాగితే అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని ఇప్పటికీ నిపుణులు చెబుతుంటారు.
ఇక పెద్దలకే కాదు పిల్లలకు గంజి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా పదేళ్లకు పైగా ఉండే పిల్లలకు ప్రతి రోజూ ఒక చిన్న కప్పుడు గంజి పట్టిస్తే.
వారి ఆరోగ్యంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి.మరి పిల్లలకు గంజిని ఎలా ఇవ్వాలి.
? అసలు పిల్లలకు గంజిని పట్టిస్తే వచ్చే లాభాలు ఏంటీ.? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లలకు ఒక చిన్న గ్లాస్ గంజిలో చిటికెడు నల్ల ఉప్పు కలిపి ఇవ్వొచ్చు.
లేదా చిన్న బెల్లం ముక్క కలిపి ఇవ్వొచ్చు.లేడా డైరెక్ట్‌గా కూడా ఇవ్వొచ్చు.
ఇలా ఎలా ఇచ్చినా ఆరోగ్యానికి మంచిదే.సాధారణంగా పిల్లలు పెద్దగా వాటర్ తాగడానికి ఇష్టపడరు.
దాంతో తరచూ వారు డిహైడ్రేషన్‌కు గురవుతుంటారు.కానీ, రోజూ ఒక కప్పు గంజిని పిల్లలకు తాగిస్తే.
వారిలో డీహైడ్రేషన్ సమస్యే ఉండదు.ఎందుకంటే, గంజి ఒక హైడ్రేటింగ్ డ్రింక్ గా పనిచేస్తుంది.
కొందరు పిల్లలు వయసు పెరుగుతున్నా బరువు మాత్రం పెరగరు.ఇది తల్లిదండ్రులకు ఆందోళన కలిగించే విషయమే.
అయితే అలాంటి పిల్లలి చేత రోజూ గంజిని తాగిస్తే.చక్కగా బరువు పెరుగుతారు.
అలాగే పిల్లలకు కాస్త గంజి పట్టిస్తే.ఎప్పుడూ యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటారు.
మరియు నీరసం, అలసట వంటి సమస్యలూ, సీజనల్ వ్యాధులూ వారి దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
ఇక కొంత మంది పిల్లల్లో మలబద్ధకం సమస్య చాలా అధికంగా ఉంటుంది.అలాంటి వారు గంజిని తాగితే.
జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారి మలబద్ధకం దూరం అవుతుంది.
రోడ్డుపై పిల్లలతో వెళ్తున్నారా.. అయితే సజ్జనార్ షేర్ చేసిన ఈ వీడియో చూడాల్సిందే..