బంగాళదుంపతో మచ్చల్లేని మెరిసే చర్మం సొంతం చేసుకోండిలా!!
TeluguStop.com
బంగాళదుంప లేదా ఆలుగడ్డ.పేరు ఏదైనా ఓషధగుణాలు మాత్రం ఒక్కటే.
బంగాళ దుంపలలో మన శరీరానికి కావాల్సిన విటమిన్‌లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇక ముఖ్యంగా మన భారతీయులు బంగాళదుంపతో అనేక రకాల వంటలు తయారు చేస్తారు.
ఎలా చేసినా బంగాళదుంప రుచి అద్భుతమనే చెప్పాలి.అయితే ఆలుగడ్డ తినేందుకు రుచిగా ఉండటమే కాదు.
చర్మ సౌందర్యాన్ని మెరిపించడంలోనూ గ్రేట్‌గా పనిచేస్తుంది.మరి ఆలుగడ్డను చర్మానికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఆలుగడ్డను ఉడికించి.తొక్క తీసేయాలి.
అనంతరం దాన్ని పేస్ట్ చేసుకుని.అందులో కొత్తి పసుపు, నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.పావు గంట తర్వాత క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. """/" /
చర్మంపై ఉన్న జిడ్డుని కూడా పీల్చుకుని.
తాజాగా మారుస్తుంది.అలాగే బంగాళదుంపును మిక్సీ పట్టి రసాన్ని తీసుకోవాలి.
ఆ రసంలో కొద్దిగా శెనగపిండి, పెరుగు కలిపి ముఖానికి పట్టించి.పావు గంట తర్వాత క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతుంది.మరియు ముఖంపై మృత కణాలను తొలిగిస్తుంది.
ఇక బంగాళాదుంపని మిక్సీ పట్టుకుని పేస్టులా చేసుకోవాలి.ఆ మిశ్రమలో తేనె కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారానికి రెండు సార్లే చేస్తే.ముడతలు పోయేలా చేస్తుంది.
మరియు చక్కని ఛాయ తీసుకువస్తుంది.
ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న రిషబ్ శెట్టి.. కోరిక తీరుతుందా?