చ‌ర్మాన్ని ప్ర‌కాశ‌వంతంగా మార్చే కందులు..ఎలా వాడాలంటే?

కందులు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.కందులు రుచిగా ఉండ‌ట‌మే కాదు.

ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్‌, ఫైబ‌ర్ ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు కూడా దాగి ఉంటాయి.

అందుకే కందులు ఆరోగ్యానికి అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.అయితే ఆరోగ్యానికే కాదు.

చ‌ర్మానికి కూడా కందులు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.ముఖ్యంగా మొటిమ‌లను, మ‌చ్చ‌ల‌ను పోగొట్టి.

చ‌ర్మాన్ని ప్ర‌కాశ‌వంతంగా మార్చ‌డంలో కందులు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి కందుల‌ను ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా కందుల‌ను పొడి చేసుకుని ఒక జార్‌లో స్టోర్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక స్పూన్ కందుల పొడి, ఒక స్పూన్ పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని.ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటిలో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే ముఖం పొడిబార‌కుండా ప్ర‌కాశ‌వంతంగా ఉంటుంది.

అలాగే మొటిమ‌ల స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారు కందుల పొడిలో కొద్దిగా నిమ్మ ర‌సం, చిటికెడు ప‌సుపు వేసి క‌లుపు కోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పూసి.పావు గంట పాటు ఆర‌నిచ్చి ఆ త‌ర్వాత కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వల్ల క్ర‌మంగా మొటిమ‌లు మ‌రియు మ‌చ్చ‌లు మ‌టుమాయం అవుతాయి.ఇక కందుల పొడిలో కొద్దిగా శెన‌గ పిండు మ‌రియు పాలు పోసి మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు పూసి.డ్రై అవ్వ‌నివ్వాలి.

ఆ త‌ర్వాత కొద్దిగా వాట‌ర్ జ‌ల్లి మెల్ల మెల్ల‌గా స్క్ర‌బ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై మృత‌క‌ణాలు, మురికి పోయి కాంతివంతంగా మారుతుంది.

వింటర్ సీజన్ లో కొబ్బరి నీళ్లు తాగొచ్చా.. తప్పక తెలుసుకోండి..!