షుగ‌ర్ పేషెంట్లు పీనట్ బ‌ట‌ర్ తీసుకుంటే ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?

పీన‌ట్ బ‌ట‌ర్ దీనినే వేరుశెన‌గ వెన్న అని అంటారు.వేరుశెన‌గ‌ల నుంచి త‌యారు అయ్యే అద్భుత‌మైన ఆహారం ఇది.

చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే పీన‌ట్ బ‌ట‌ర్‌ను దాదాపు అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటుంటారు.

పైగాత‌క్కువ ధ‌ర‌కే ల‌భించే పీన‌ట్ బ‌ట‌ర్‌లో ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి, విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, ప్రోటీన్‌, ఫైబ‌ర్‌, కార్బోహైడ్రేట్స్, మోనో అన్ సాట్యురేటెడ్ ఫ్యాట్స్ వంటి పోష‌కాలు ఎన్నో నిండి ఉంటాయి.

అందుకే ఆరోగ్య ప‌రంగా పీన‌ట్ బ‌ట‌ర్ అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంది.ముఖ్యంగా షుగ‌ర్ పేషెంట్లు పీన‌ట్ బ‌ట‌ర్ ను లిమిట్‌గా తీసుకుంటే చాలా మేలు చేస్తుంద‌ని అంటున్నారు నిపుణులు.

ర‌క్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించగ‌ల‌ సామ‌ర్థ్యం పీన‌ట్ బ‌ట‌ర్‌కు ఉంది.మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు రోజుకు ఒక స్పూన్ చ‌ప్పున పీన‌ట్ బ‌ట‌ర్‌ను తీసుకుంటే బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ చ‌క్క‌గా కంట్రోల్ అవుతాయి.

అలాగే మ‌ధుమేహం ఉన్న వారు స్వీట్స్ తిన‌డం కోసం తెగ ఆరాట‌ప‌డుతుంటారు.అయితే అలాంటి స‌మ‌యంలో పీన‌ట్ బ‌ట‌ర్‌ను తీసుకుంటే తీపి తినాల‌న్న కోరిక త‌గ్గిపోతుంది.

పైగా పీన‌ట్ బ‌ట‌ర్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలను కలిగి ఉంటుంది.అందువ‌ల్ల దానిని తిన్నా రక్తంలో చక్కెర స్థాయి పెరగదు.

"""/"/ షుగ‌ర్ పేషెంట్లు గుండె జ‌బ్బులు బారిన ప‌డే రిస్క్ చాలా ఎక్కువ‌గా ఉంటుంది.

ఆ రిస్క్‌ను త‌గ్గించ‌డంలో పీన‌ట్ బ‌ట‌ర్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.ప‌రిమితంగా పీన‌ట్ బ‌ట‌ర్‌ను తీసుకుంటే మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తుల్లో గుండె జ‌బ్బులు వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది.

ఇక షుగ‌ర్ వ్యాధి ఉన్న వారు పీన‌ట్ బ‌టర్‌ను తీసుకుంటే అతి ఆక‌లి దూరం అవుతుంది.

దాంతో చిరు తిండ్ల‌పై మ‌న‌సు మ‌ల్ల‌కుండా ఉంటుంది.ఫ‌లితంగా వెయిట్ లాస్ అవుతారు.