ముఖాన్ని మెరిపించే పెసలు.. ఎలాగో తెలుసా?

పెస‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి అందరికీ తెలిసిందే.పెస‌ళ్ల‌లో విటమిన్స్, ప్రోటీనులు పుష్క‌లంగా ల‌భిస్తాయి.

నిత్యం వీటిని తీసుకుంటుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది.గుండె జ‌బ్బులు దూరం అవుతాయి.

బ్ల‌డ్ షుగర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంచుతుంది.ఇలా ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పెస‌లుతో పొందొచ్చు.

అదే స‌మ‌యంలో చ‌ర్మంపై మ‌చ్చ‌లు, మొటిమ‌లు లేకుండా చేసి.ప్ర‌కావంతంగా మెరిపించే శ‌క్తి కూడా పెస‌లు‌కు ఉంది.

పెస‌లు‌ను ముఖానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా పెస‌లును నీటిలో నాన‌బెట్టాలి.

బాగా నానిన త‌ర్వాత నీరు తీసేసి పేస్ట్‌లా చేసుకోవాలి.ఇప్పుడు ఈ పేస్ట్‌లో చిటికెడు ప‌సుపు మ‌రియు పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి మ‌రియు మెడ‌కు బాగా అప్లై చేయాలి.ఒక పావు గంట పాటు ఆర‌నిచ్చి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గి.

చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.రెండొవ‌ది.

ముందుగా పెస‌లును నీటిలో నాన‌బెట్టాలి.బాగా నానిన త‌ర్వాత నీరు తీసేసి పేస్ట్‌లా చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పేస్ట్‌లో కొద్ది తేనె క‌లిపి.ముఖానికి అప్లై చేయాలి.

బాగా ఆరిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల ముఖంపై మృత‌క‌ణా‌లు పోతాయి.

మ‌రియు చ‌ర్మం మంచి రంగు సంత‌రించుకుంటుంది.మూడొవ‌ది.

మ‌ళ్లీ పెస‌లును నీటిలో నాన‌బెట్టి.నానిన త‌ర్వాత నీరు తీసి పేస్ట్‌లా చేసుకోవాలి.

ఈ పేస్ట్‌లో కొద్దిగా నిమ్మ‌ర‌సం వేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి మ‌రియు మెడ‌కు అప్లై చేసి.

అర‌గంట పాటు ఆర‌నివ్వాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల టాన్ తొలగిపోవ‌డంతో పాటు చ‌ర్మం గ్లోగా కూడా మారుతుంది.

మెగా డాటర్ కు షాకిచ్చిన రాజమౌళి.. ఆ ప్రాజెక్ట్ రిలీజ్ చేయొద్దని క్లారిటీగా చెప్పేశారా?