గుండె జ‌బ్బుల‌కు చెక్ పెట్టే లిచీ పండ్లు..ఎప్పుడు తీసుకోవాలంటే?

చూసేందుకు స్ట్రాబెరీ పండ్ల‌లా ఉండే లిచీ పండ్లు.ఈ మ‌ధ్య కాలంలో అంద‌రికీ అందుబాటులోకి వ‌చ్చాయి.

ఈ లిచీ పండ్లు రుచిక‌రంగా ఉండ‌ట‌మే కాదు.పొటాషియం, ఐరన్, కాపర్, మెగ్నిషియం, పాస్ఫరస్, మాంగనీస్, విట‌మిన్ సి, విట‌మిన్ బి, విట‌మిన్ ఎ, ఫైబ‌ర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా బోలెడ‌న్ని పోష‌కాలు కూడా నిండి ఉంటాయి.

అందుకే లిచీ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.బాగా పండిన లిచీ పండ్ల‌ను ఒక‌టి లేదా రెండు చ‌ప్పున ప‌గ‌టి పూట తీసుకుంటే.

ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చు. """/"/ ముఖ్యంగా గుండె జ‌బ్బుల‌ను ద‌రి చేర‌కుండా చేయ‌డంలో లిచీ పండ్లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

సాధార‌ణంగా చెడు కొలెస్ట్రాల్ పెరిగే కొద్ది.గుండె ఆరోగ్యం దెబ్బ తింటూ వ‌స్తుంది.

అందుకే చెడు కొలెస్ట్రాల్ క‌రిగించుకోవాల‌ని నిపుణులు సూచిస్తుంటారు.అయితే లిచీ పండ్లు తీసుకుంటే.

అందులో ఉండే పలు పోష‌కాలు బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను నియంత్రించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

అదే స‌మ‌యంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణను కూడా పెంచుతాయి.త‌ద్వారా గుండె పోటు మ‌రియు ఇత‌ర గుండె సంబందిత జ‌బ్బులు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

అలాగే లిచీ పండ్ల‌ను డైట్‌లో చేర్చుకుంటే.వాటిలో ఉండే విట‌మిన్ సి రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌ల‌ప‌డేలా చేస్తుంది.

లిచీ పండ్ల‌లో పోష‌కాలతో పాటు వాట‌ర్ కంటెంట్ కూడా ఎక్కువే.కాబ‌ట్టి, వీటిని తీసుకుంటే శ‌రీరం హైడ్రేట్‌గా ఉంటుంది.

"""/"/ అంతేకాదు, లిచీ పండ్లును త‌గిన మోతాదులో రెగ్యుల‌ర్‌గా తీసుకుంటే.వ‌య‌సు పైబడే కొద్ది వ‌చ్చే వృద్ధాప్య‌ఛాయ‌ల‌కు దూరంగా ఉండొచ్చు.

అయితే లిచీ పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ.వీటిని ప‌ర‌గ‌డుపు మ‌రియు రాత్రి పూట అస్స‌లు తిన‌రాదు.

అలాగే ప‌చ్చిగా ఉన్న లిచీ పండ్ల‌కు కూడా దూరంగా ఉండాలి.లేదంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

జీవితం ఫర్ఫెక్ట్ గా లేదు.. నరేష్ సంచలన వ్యాఖ్యలు.. పవిత్రతో గొడవలే కారణమా?