గ్రీన్ టీతో పాదాలకు మెరుపు.. ఖచ్చితంగా ట్రై చేయండి!
TeluguStop.com
గ్రీన్ టీప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సేవించే పానీయమిది.ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నించేవారు తప్పనిసరిగా తమ డైట్‌లో గ్రీన్ టీని చేర్చుకుంటారు.
అలాగే గుండె ఆరోగ్యాన్ని పెంచడంలోనూ, ఒత్తిడిని నివారించడంలోనూ, మధుమేహాన్ని అదుపు చేయడంలోనూ, ఇమ్యూనిటీని పెంచడంలోనూ, సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలోనూ గ్రీన్ టీ అద్భుతంగా సహాయపడుతుంది.
అలాగే పాదాల సంరక్షణకు కూడా గ్రీన్ టీ సూపర్‌గా హెల్ప్ చేస్తుంది.ముఖ్యంగా గ్రీన్ టీతో ఇప్పుడు చెప్పబోయే విధంగా పాదాలను అందంగా మెరిపించుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం అసలు మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం పదండీ.ముందుగా పాదాలను రెగ్యులర్ సోప్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బకెట్‌లో గోరు వెచ్చని నీటిని తీసుకుని.అందులో మూడు లేదా నాలుగు గ్రీన్ టీ బ్యాగులను వేయాలి.
వాటర్ కలర్ ఛేంజ్ అవ్వగానే అందులో మూడు టేబుల్ స్పూన్ల బాత్ సాల్ట్, నాలుగు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/" /
ఆ తర్వాత పాదాలను వాటర్ బకెట్‌లో పెట్టి.పది నుంచి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
ఆపై ప్యూమిస్ స్టోన్‌ను తీసుకుని పాదాలను డెడ్ స్కిన్ సెల్స్ వదిలేలా స్క్రబ్ చేసుకోవాలి.
ఇప్పుడు నార్మల్ వాటర్‌తో పాదాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా టవల్‌తో శుభ్రం చేసుకోవాలి.
ఆ వెంటనే ఏదైనా మాయిశ్చరైజర్‌ను అప్లై చేసుకోవాలి.ఇలా వారంలో ఒకే ఒక్కసారి చేశారంటే పాదాలు తెల్లగా, అందంగా మెరిసి పోతాయి.
పాదాలపై చర్మం మృదువుగా, కోమలంగా మారుతుంది.అలాగే చాలా మంది పాదాల పగుళ్లతో తీవ్రంగా సతమతం అవుతుంటారు.
వాటిని నివారించుకోవడం కోసం రకరకాల క్రీములను వాడుతుంటారు.అలాంటి వారు గ్రీన్ టీతో పైన చెప్పిన విధంగా చేస్తే చాలా సులభంగా పాదాల పగుళ్లను వదిలించుకోవచ్చు.
ప్రవాసీ భారతీయ దివస్ 2025 .. భువనేశ్వర్‌లో ఎన్ఆర్‌లకు భారీ స్వాగత ఏర్పాట్లు