మొలకెత్తిన పెసలతో ఇలా చేస్తే.. స్కిన్ టోన్ పెరుగుతుంద‌ట‌?!

మొల‌కెత్తిన పెస‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.మామూలు పెస‌ల కంటే మొల‌కెత్తిన పెస‌ల్లో కాల్షియం, ఐర‌న్‌, మెగ్నీషియం, పాటిషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ డి, ప్రోటీన్, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అన్ని పోష‌కాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి.

అందుకే హెల్తీగా, ఫిట్‌గా ఉండాల‌ని కోరుకునే వారు.ఖ‌చ్చితంగా త‌మ డైట్‌లో వీటిని చేర్చుకుంటారు.

అయితే ఆరోగ్యానికే కాదు.చ‌ర్మానికి కూడా మొల‌కెత్తిని పెస‌లు ఎంతో చేస్తాయి.

ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.మ‌రి వీటిని చ‌ర్మానికి ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

"""/"/ ముందుగా మొల‌కెత్తిన పెస‌ల‌ను తీసుకుని పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఇందులో కొద్దిగా తేనె మ‌రియు గోరు వెచ్చ‌ని నీరు పోసి లూజ్‌గా క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నిచ్చి అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా డే బై డే చేస్తూ ఉంటే స్కిన్ టోన్ పెరుగుతుంది.అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో మొల‌కెత్తిన పెస‌ల పేస్ట్‌, పెరుగు మ‌రియు కొద్దిగా నిమ్మ ర‌సం క‌లిపి.

ముఖానికి ప‌ట్టించాలి.బాగా ఆరిన త‌ర్వాత వేళ్ల‌తో రుద్దుకుంటూ గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తూ ఉంటే.న‌ల్ల‌టి మ‌చ్చ‌లు, మొటిమ‌లు త‌గ్గి చ‌ర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

"""/"/ ఇక ఒక గిన్నెలో మొల‌కెత్తిన పెస‌ల పేస్ట్ వేసి.అందులో కొద్దిగా గ్రీన్ టీ చేర్చి బాగా క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు పూసుకుని.ప‌ది నుంచి ఇర‌వై నిమిషాలు పాటు వ‌దిలేయాలి.

ఆ త‌ర్వాత కూల్ వాట‌ర్ యూజ్ చేసి.చ‌ర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే.ముడ‌త‌లు పోయి చ‌ర్మం య‌వ్వ‌నంగా, కోమ‌లంగా త‌యార‌వుతుంది.

ఈ ప్రముఖ టాలీవుడ్ నటి ఇద్దరు కూతుళ్లు డాక్టర్లే.. ఎంతో అదృష్టవంతురాలు అంటూ?