గోరువెచ్చని నీటిలో వెల్లుల్లి రసం కలిపి త్రాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు
TeluguStop.com
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని ఒక సామెత ఉంది.
అలాగే.వెల్లుల్లితోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఉదయం లేచిన వెంటనే పరగడుపున వెల్లుల్లి తింటే దాదాపు అన్నిరకాల అనారోగ్యాలకు దూరం కావొచ్చు.
ముఖ్యంగా పచ్చి వెల్లుల్లి తింటే చాలా మంచిది.వెల్లుల్లిలో శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి.
అందువల్ల దాదాపుగా 7 వేల ఏళ్ల క్రితం నుంచే వెల్లుల్లిని ఆహారంగా ఉపయోగిస్తున్నారు.
వెల్లుల్లిని కాస్త నీటిలో మరిగించి ఆ నీటిని ఉదయం పరగడుపున తాగడం వల్ల బరువు తగ్గుతారు.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ వెల్లుల్లి రసం, 2 స్పూన్ల తేనె కలుపుకుని తాగితే ఆస్త్మా సమస్య నుండి బయట పడవచ్చు.
ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ లో ఒక స్పూన్ వెల్లుల్లి రసాన్ని కలుపుకుని తాగితే వానా కాలంలో వచ్చే అన్ని రకాల దగ్గులు, జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.
బట్టతల ఏర్పడిన ప్రదేశంలో కొద్దిగా వెల్లుల్లి రసం రాస్తే అక్కడ జుట్టు బాగా పెరుగుతుంది.
ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కాస్త వెల్లుల్లి రసాన్ని కలిపి రోజూ ఉదయం తాగితే చాల మంచిది.
పచ్చి వెల్లుల్లిని తినాలంటే ఘాటుగా ఉంటుందనుకుంటే.దాన్ని నలిపి ఒక 15 నిమిషాలపాటు అలా ఉంచి, ఆ తర్వాత తింటే ఘాటు తగ్గుతుంది .
అప్పటికీ ఇబ్బందే అనుకుంటే ఏదైనా వెజిటెబుల్ ఆయిల్‌తో కలిపి తినవొచ్చు.
నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!