ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో రాగులు తింటే ఏం అవుతుందో తెలుసా?

ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో అన్ని విష‌యాల్లోనూ అనేక‌ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.అలాగే ఎన్నో ఆహార నియ‌మాలు పాటించాల్సి ఉంటుంది.

ముఖ్యంగా త‌ల్లి, క‌డుపులో శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే ఖ‌చ్చితంగా కొన్ని ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది.

అలాంటి వాటిలో రాగులు ఒక‌టి.వీటిలో కాల్షియం, ఐర‌న్‌, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌, విట‌మిన్ బి, ప్రోటీన్‌, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నెన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.

అందుకే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో రాగుల‌ను తీసుకుంటే బోలెడ‌న్ని హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.సాధార‌ణంగా ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో దాదాపు స్త్రీలంద‌రిలోనూ ర‌క్త హీన‌త స‌మ‌స్య కామ‌న్‌గా క‌నిపిస్తుంది.

అయితే ఈ స‌మ‌స్య‌ను నివారించ‌డంలో రాగులు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.గ‌ర్భిణీలు బెల్లంతో చేసిన రాగి ల‌డ్డూలు ప్ర‌తి రోజు తీసుకుంటే శ‌రీరానికి ఐర‌న్ పుష్క‌లంగా అంది ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య పెరుగుతుంది.

దాంతో ర‌క్త హీన‌త ప‌రార్ అవుతుంది.మ‌రియు ఇత‌ర జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను సైతం ద‌రి చేర‌కుండా అడ్డుక‌ట్ట వేస్తాయి.

"""/" / అలాగే పైన చెప్పుకున్న‌ట్టు రాగుల్లో ప్రోటీన్‌, కాల్షియం స‌మృద్ధిగా ఉంటాయి.

అందు వ‌ల్ల‌, ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో రాగుల‌తో త‌యారు చేసిన ఇడ్లీ, దోస‌, సంక‌టి వంటివి తీసుకుంటే క‌డుపులోని శిశువు ఎదుగుద‌ల అద్భుతంగా ఉంటుంది.

ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో చాలా మంది మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతూ ఉంటారు.అయితే రోజూ రాగి జావ‌ను త‌గిన మోతాదులో తీసుకుంటే.

అందులో ఉండే ఫైబ‌ర్ కంటెంట్ పేగు క‌ద‌లిక‌ల‌ను వేగ‌వంతం చేసి మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని నివారిస్తాయి.

మ‌రియు ఇత‌ర జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను సైతం ద‌రి చేర‌కుండా అడ్డుక‌ట్ట వేస్తాయి.

"""/" / అంతేకాదు, ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో రాగుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచిగా నిద్ర ప‌డుతుంది.

శ‌రీరంలో అధిక వేడి త‌గ్గు ముఖం ప‌డుతుంది.మ‌రియు నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

ఒకే ఒక్క వాష్ లో చుండ్రు పోవాలంటే ఈ రెమెడీని ట్రై చేయండి!