మెంతులు మహిళలకు ఎంత సాయం చేస్తాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు
TeluguStop.com
మన భారతీయులు పురాతన కాలం నుండి మెంతులను ఉపయోగిస్తున్నారు.మెంతుల్లో
ఉండే లక్షణాలు,పోషకాలు ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి.
మెంతులను
కూరల్లో వేసినప్పుడు మంచి వాసన రుచి వస్తాయి.మెంతులను సరైన మోతాదులో
సరైన క్రమంలో తీసుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
అయితే వాటి గురించి
వివరంగా తెలుసుకుందాం. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
మన దేశంలో పురాతన కాలం నుండి మెంతులతో తయారుచేసిన ఆహారాన్ని బాలింతలకు
పెట్టటం జరుగుతుంది.
దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది.మెంతులను తింటే
బాలింతలో పాలు బాగా పడతాయి.
మెంతులను నేతిలో వేగించి పొడి చేయాలి.మెంతుల
పరిమాణంలోనే గోధుమపిండిని తీసుకోని మెంతుల పొడి వేసి పంచదారతో హాల్వా
తయారుచేసుకోవాలి.
ఈ హాల్వా ను ని ప్రతి రోజు తినాలి.ఇది బాలింతకు బాగా
పనిచేస్తుంది.
!--nextpage
గర్భధారణ సమయంలో స్త్రీలు మెంతులను తీసుకుంటే డెలివరీ సమయంలో వచ్చే
నొప్పులు కాస్త తక్కువగా ఉంటాయి.
అయితే మెంతులను తగిన మోతాదులో మాత్రమే
తీసుకోవాలి.దేనికైనా లిమిట్ అనేది ఉండాలి కదా.
మెంతులు అనేవి స్త్రీలకు ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని చూపుతాయి.మెంతులను వాడటం వలన హార్మోన్స్ విడుదల సక్రమంగా ఉండి రుతు సమయంలో వచ్చే
సమస్యలు తగ్గటమే కాకుండా రుతుక్రమం కూడా సరిగ్గా వస్తుంది.
మలబద్దకం సమస్య ఉన్నవారు ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు నీటిలో
నానబెట్టిన మెంతులను తింటే ఆ సమస్య నుండి బయట పడతారు.