చలికాలంలో వేరుశనగలు తింటున్నారా.. మరి మీకు ఈ విషయాలు తెలుసా?
TeluguStop.com
వేరుశనగలు.( Groundnuts ) వీటి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు.
నిత్యం వంటల్లో వేరుశనగలను విరివిరిగా వాడుతుంటారు.ముఖ్యంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో చాలా మంది వేరుశనగలతో చట్నీ తయారు చేస్తుంటారు.
అలాగే తాలింపులో కూడా వేరుశనగలను వినియోగిస్తుంటారు.అయితే ప్రస్తుత చలికాలంలో వేరుశనగలను తినొచ్చా.
? తినకూడదా.? అనే డౌట్ చాలా మందికి ఉంటుంది.
కొందరు అలర్జీలు వస్తాయని, తినకూడదని వాటిని పక్కన పెట్టేస్తుంటారు.అలాగే మరికొందరు అదేమీ పట్టించుకోకుండా తింటారు.
నిజానికి చలికాలంలో ఎలాంటి భయం లేకుండా వేరుశనగలను తినొచ్చు.వేరుశనగలు రుచిగా ఉండడమే కాదు బోలెడన్ని పోషకాలను కలిగి ఉంటాయి.
చలికాలంలో ఆరోగ్యపరంగా వేరుశనగలు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.ప్రతిరోజు గుప్పెడు వేరుశనగలను బెల్లంతో కలిపి తీసుకుంటే మస్తు ఆరోగ్యం లాభాలు పొందవచ్చు.
"""/" /
చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే సామర్థ్యం వేరుశనగలకు ఉంది.వీటిని తీసుకుంటే సమర్థవంతంగా చలి పులిని ఎదుర్కోవచ్చు.
అలాగే వేరుశనగలను తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.దాంతో సీజనల్ వ్యాధులు( Seasonal Diseases ) దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
చలికాలంలో దాదాపు ప్రతి ఒక్కరి చర్మం పొడి బారిపోయి నిర్జీవంగా, కాంతిహీనంగా తయారవుతుంది.
అయితే వేరుశనగలు ఆ సమస్యకు చెక్ పెడతాయి.వీటిని తీసుకోవడం వల్ల అందులో ఉండే విటమిన్ ఈ చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా మారుస్తుంది.
"""/" /
అంతేకాదు వేరుశనగలను ఆహారంలో భాగం చేసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.అల్జీమర్స్( Alzheimers ) వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ప్రోటీన్ కొరత ఏర్పడకుండా ఉంటుంది.జీర్ణ క్రియ మెరుగుపడే మలబద్ధకం సమస్య( Constipation ) సైతం దూరం అవుతుంది.
అయితే వేరుశనగలు చలికాలంలో ఆరోగ్యానికి మంచివే.కానీ, అతిగా తీసుకుంటే మాత్రం లేనిపోని సమస్యలు తలెత్తుతాయి.
ముఖ్యంగా వేరుశనగలను అధిక మొత్తంలో వాడటం వల్ల కొలెస్ట్రాల్ భారీగా పెరుగుతుంది.కొలెస్ట్రాల్ పెరిగితే గుండెకు ముప్పు కూడా పెరుగుతుంది.
మరియు వేరుశనగలను అతిగా తింటే షుగర్ లెవెల్స్( Sugar Levels ) సైతం కంట్రోల్ తప్పుతాయి.
హెయిర్ రూట్స్ ను సూపర్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ గా మార్చే బెస్ట్ టానిక్ మీ కోసం!