ఎండాకాలంలో పచ్చిమామిడి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
TeluguStop.com
ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయలు దాదాపు వచ్చేసాయి అనుకోవచ్చు.ఎందుకంటే చాలామంది ప్రజలు వేసవిలో మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.
అయితే వేసవిలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకు మామిడి మందు అని చాలామందికి తెలియదు.
అవును వేసవి వస్తే ఎండ వేడిమి పెరుగుతుంది.దీంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.
ఈ సమయంలో పచ్చి మామిడికాయ తినడం చాలా మంచిది.పచ్చి మామిడిలో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.
వేసవిలో వచ్చే అనేక వ్యాధులకు ఇది ఎంతో ఎఫెక్ట్ గా పని చేస్తుంది.
ఈ సంవత్సరం ఎండాకాలంలో తీవ్రమైన ఎండలు అందరినీ ఇబ్బంది పెడతాయని ఇప్పటికే పరిశోధకులు చెబుతున్నారు.
కాబట్టి పచ్చి మామిడి పోషకాహారం మరియు ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.తీవ్రమైన వేడి శరీరాన్ని డిహైడ్రేట్ చేస్తూ ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే చాలామంది వడదెబ్బకు గురవుతూ ఉంటారు.శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుకోవడానికి ఆహారంతో పాటు పచ్చి మామిడిని తీసుకోవడం ఎంతో మంచిది.
పచ్చిమామిడిలో ఉన్న పోషక విలువలు దంతాలు,చిగుళ్ల సమస్య నుంచి రక్షిస్తాయి. """/" /
అధిక బరువును దూరం చేసుకోవడానికి, రక్తహీనత వంటి సమస్యలను నివారించడానికి మీ ఆహారంలో పచ్చిమామిడి తీసుకోవడం ఎంతో మంచిది.
వేసవికాలంలో శరీరం డిహైడ్రేషన్ తో కండరాలు తిమ్మిరిని కలిగిస్తాయి.దీని నుంచి బయట పడాలంటే పచ్చి మామిడిపండును తినడం ఎంతో మంచిది.
"""/" /
పచ్చి మామిడి రసం మలబద్ధకానికి ఎంతగానో పని చేస్తుంది.పచ్చి మామిడి అజీర్ణం వంటి కడుపు సమస్యల దూరం చేస్తుంది.
ఆరోగ్యానికి మంచిదని పచ్చి మామిడి కాయను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలకు గురవుతారు.
కాబట్టి ఆరోగ్యానికి ఎంత మంచిదైనా ఆహార పదార్థం కూడా తగిన మోతాదులో తీసుకోవడమే మంచిది.
విమానంలాంటి అద్భుతమైన కారును కొనుగోలు చేసిన విజయ్.. ఈ కారు ప్రత్యేకతలివే!