వేసవిలో నెయ్యి తీసుకుంటున్నారా..? మరి ఈ విషయాలు మీకు తెలుసా?
TeluguStop.com
నెయ్యి.దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
పాల నుంచే నెయ్యిని తయారు చేసినా పాల కంటే ఎక్కువ రుచిని కలిగి ఉంటుంది.
అందుకే ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎంతో ఇష్టంగా నెయ్యిని తీసుకుంటారు.
అలాగే విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ డి, కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల నెయ్యి ఆరోగ్య పరంగా బోలెడన్ని ప్రయోజనాలను అందిస్తుంది.
ముఖ్యంగా ప్రస్తుత వేసవి కాలంలో నెయ్యిని తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.ఎందుకు తీసుకోవాలి.
అసలు వేసవిలో నెయ్యిని తీసుకుంటే ఏయే ప్రయోజనాలు లభిస్తాయి.వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సమ్మర్ సీజన్‌లో ప్రధానంగా వేధించే సమస్యల్లో డీహైడ్రేషన్ ముందు వరసలో ఉంటుంది.అయితే ఈ సమస్యకు అడ్డుకట్ట వేయడంలో నెయ్యి గ్రేట్‌గా హెల్ప్ చేస్తుంది.
రోజుకు ఒక స్పూన్ నెయ్యిని తీసుకుంటే బాడీ హైడ్రేటెడ్‌గా ఉంటుంది.అలాగే వేసవిలో చాలా మంది మలబద్ధకంతో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు.
అలాంటి వారు ప్రతి రోజు నిద్రించే ముందు గ్లాస్ గోరు వెచ్చని పాలలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి, చిటికెడు మిరియాల పొడి కలిపి తీసుకోవాలి.
ఇలా చేస్తే జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.ఫలితంగా మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు పరార్ అవుతాయి.
"""/"/
వేసవి వేడి వల్ల వచ్చే నీరసాన్ని వదిలించడంలోనూ నెయ్యి అద్భుతంగా సహాయపడుతుంది.
రెగ్యులర్‌గా ఒక స్పూన్ చప్పున నెయ్యిని తీసుకుంటే నీరసం, అలసట వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
అంతేకాదు, నెయ్యిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
ఎముకలు దృఢపడతాయి.గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
మరియు రోజంతా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటారు.
సుకుమార్ రామ్ చరణ్ కాంబోలో మూవీ కి రంగం సిద్ధం చేస్తున్నారా..?