ఇలాంటి పాత్రల్లో వంట చేసుకుని తింటే.. అధిక బరువు దూరం!
TeluguStop.com
అధిక బరువు.చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
కేలరీలు ఎక్కువగా తీసుకోవడం, అధిక సమయంలో పాటు కూర్చోవడం, వ్యాయామాలు చేయకపోవడం, ఆహారపు అలవాట్లు ఇలా రకరకాల కారణాల వల్ల అధిక బరువు సమస్య బారిన పడుతున్నారు.
ఇక బరువు పెరిగారంటే.వెంటనే మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, శ్వాస సమస్యలు వంటివి దరి చేరుతుంటాయి.
అందుకే బరువు తగ్గాలని చాలా మంది నానా ప్రయత్నాలు చేస్తుంటారు.ఇక ప్రస్తుత కాలంలో బరువు తగ్గేందుకు చాలా పద్ధతులు ఉన్నాయి.
వాటిని ఫాలో అయితే ఖచ్చితంగా బరువు తగ్గొచ్చు .అయితే మట్టి పాత్రల్లో వంటలు చేసుకుని తిన్నా కూడా అధిక బరువుకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు నిపుణులు.
మట్టి పాత్రలకు, అధిక బరువు సంబంధం ఏంటీ అన్న సందేహం మీకు వచ్చే ఉంటుంది.
అయితే ఆగండి.అక్కడికే వస్తున్నా.
ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా.స్టీల్, ప్లాస్టిక్, ఇత్తడి పాత్రలే కనిపిస్తున్నాయి.
"""/" /
కానీ, పూర్వ కాలంలో అందరూ మట్టి పాత్రల్లోనే వంటలు వండుకుని తినేవారు.
మట్టి పాత్రల్లో వంటలు వండటం వల్ల ఆహారానికి రుచి పెరగడంతో పాటు.ఆహారంలో ఏ విధమైన రసాయనాలు కలవకుండా ఉండేది.
మట్టి పాత్రల్లో వంట చేయడం వలన పోషకాలు కూడా ఆవిరి కాకుండా ఉంటాయి.
దాంతో మన పూర్వీకులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా ఉండేవి కావు.ఇక మట్టి పాత్రల్లో తినడం వల్ల అధిక బరువు, పొట్ట చుట్టు కొవ్వు వంటి సమస్యలు కూడా దూరం అవుతాయట.
ఈ విషయం స్వయంగా శాస్త్రవేత్తలే చెబుతున్నారు.పలు పరిశోధనల అనంతరం శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు.
మట్టి పాత్రల్లో వంట చేసుకుని రెగ్యులర్‌గా తినడం వల్ల శరీరంలో మరియు పేగుల్లోని అధిక కొవ్వు కరిగిపోతుందట.
ఫలితంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.కాబట్టి, బరువు తగ్గాలని ప్రయత్నించే వారు మట్టి పాత్రల్లో తయారు చేసిన వంటలు తీసుకోవడానికి ప్రయత్నించండి.
ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి అన్ని పోషకాలు కూడా పుష్కలంగా అందుతాయి.
వీరయ్యను మించేలా డాకు మహారాజ్.. నాగవంశీ అంచనాలను పెంచారుగా!