ముఖంపై ముడతలను పోగొట్టే క్యాబేజ్.. ఎలాగంటే?
TeluguStop.com
వయసు పైబడే కొద్ది ముడతలు రావడం సహజమే.కానీ, నేటి కాలంలో మారిన జీవనశైలి, కాలుష్యం, ఆహారపు అలవాట్లు ఇలా రకరకాల కారణాల వల్ల పాతిక ఏళ్లకే ముఖంపై ముడతలు వచ్చేస్తున్నాయి.
ఇక ముఖంపై ముడతలు ఉంటే.చిన్న వయసే అయినా ముసలివారిగా కనిపిస్తారు.
అందుకే ముడతలు వచ్చాయంటే.వాటిని ఎలా తగ్గించుకోవాలా అని తెగ హైరానా పడిపోతుంటారు.
అయితే ముఖంపై ముడతలను తగ్గించడంలో క్యాబేజ్ అద్భుతంగా సహాయపడుతుంది.మరి క్యాబేజ్‌ను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా క్యాబేజ్ తీసుకుని మెత్తగా చేసి రసం తీసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో క్యాబేజ్ రసం, కొద్దిగా తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.ఇరవై నిమిషాలు లేదా ముప్పై నిమిషాలు ఆరనివ్వాలి.
అనంతరం కోల్డ్ వాటర్‌తో ఫేష్ వాష్ చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే ముఖంపై ముడతలు తగ్గి.
యవ్వనంగా మారుతుంది. """/" /
అలాగే క్యాబేజ్‌ను మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి.
ఆ తర్వాత అందులో కొద్దిగా పెరుగు మరియు బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.పావు గంట తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారంలో మూడు లేదా నాలుగు సార్లు చేయడం వల్ల కూడా ముడతలు, సన్నని గీతలు తగ్గుమఖం పడతాయి.
ఇక మూడొవది.క్యాబేజ్ ఆకుల నుంచి రసం తీసుకుని ఒక బౌల్‌లో వేసుకోవాలి.
ఆ తర్వాత అందులో కొద్దిగా ఇంట్లో తయారు చేసుకున్న రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి రాత్రి పడుకునే ముందు అప్లై చేసి.ఉదయం లేవగానే చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
చుట్టమల్లే వర్సెస్ కిస్సిక్ వర్సెస్ నానా హైరానా.. మూడు సాంగ్స్ లో బెస్ట్ సాంగ్ ఇదేనా?