గర్భిణీలు మినుములు తీసుకుంటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
TeluguStop.com
ప్రెగ్నెన్సీ అనేది ప్రతి మహిళకు ఒక గొప్ప వరం.ఆ వరాన్ని పొందాలని పెళ్లైన ప్రతి మహిళా కోరుకుంటుంది.
ఇక ప్రెగ్నెన్సీ సమయంలో పుట్టబోయే బిడ్డ గురించి తల్లి ఎన్నో కలలు కంటుంది.
ఆరోగ్యమైన మరియు అందమైన బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటుంది.అందు కోసం ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటారు.
ముఖ్యంగా తీసుకునే ఆహారంలో ఎన్నో మార్పులు, చేర్పులు చేసుకుంటాయి.అయితే కొన్ని కొన్ని ఆహారాలు ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అలాంటి వాటిలో మినుములు కూడా ఉన్నాయి.మన దేశంలో విరి విరిగా వాడే పప్పు ధాన్యాల్లో మినుములు ముందుంటాయి.
మినుములతో ఎన్నో వంటలు చేస్తుంటారు.దోస, ఇడ్లీ, గారి, పునుకులు, మొలకలు, సున్నుండలు ఇలా ఎన్నో వంటలు చేస్తుంటారు.
మినుములు మంచి రుచి కలిగి ఉండటమే కాదు.బోలెడన్ని పోషకాలు కూడా నిండి ఉంటాయి.
విటమిన్ బి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, ప్రోటీన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఇలా అనేక పోషకాలు మినుముల ద్వారా పొందొచ్చు.
అందుకే మినుములను డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతుంటారు.అయితే ముఖ్యంగా గర్భిణీలకు మినుములు ఎంతో మేలు చేస్తాయి.
ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది రక్త హీనతతో బాధ పడుతుంటారు.అలాంటి వారు రెగ్యులర్‌గా మినప సున్నుండలు తీసుకుంటే.
ఐరన్ పుష్కలంగా అందుతుంది.దాంతో రక్త హీనత పరార్ అవుతుంది.
"""/" /
అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో కొందరు మధుమేహం బారిన పడుతుంటారు.అయితే మినుములను ఏదో ఒక రూపంలో తీసుకుంటే.
బ్లడ్ షుగర్ లెవల్స్ ఎప్పుడూ కంట్రోల్‌లో ఉంటాయి.ఇక మినుముల్లో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్ గర్భిణీ స్త్రీలను తరచూ ఇబ్బంది పెట్టే మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది అంతేకాదు, కడుపులో మంట, నొప్పి వంటి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది.
గర్భిణీలు తమ డైట్‌లో మినుములు ఉండే చూసుకుంటే మంచిది..
ఇదేం ఆనందాంరా బాబు.. విడాకులు వచ్చాయని ఏకంగా?