భృంగ‌రాజ్ ఆయిల్‌ను ఇలా వాడితే జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రార్‌!

ఇటీవ‌ల కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా దాదాపు అంద‌రినీ ఏదో ఒక జుట్టు సంబంధిత స‌మ‌స్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.

జుట్టు రాల‌డం, పొట్లి పోవ‌డం, పొడి బారడం, చుండ్రు ఇలా ఏదో ఒక స‌మ‌స్య మ‌న‌శాంతి లేకుండా చేస్తుంటుంది.

అయితే ఈ స‌మ‌స్య‌ల‌న్నిటికీ చెక్ పెట్ట‌డంలో భృంగ‌రాజ్ ఆయిల్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.భృంగ‌రాజ్ ఆయిల్‌లో ఉండే కొన్ని ప్ర‌త్యేక‌మైన పోష‌కాలు కేశాల‌కు మంచి పోష‌ణ అందించి.

ఆయా స‌మ‌స్య‌ల‌ను నివారిస్తుంది.మ‌రి ఇంత‌కీ భృంగ‌రాజ్ ఆయిల్‌ను ఎలా వాడాలి.

? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ప‌ది మందారం ఆకుల‌ను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పేస్ట్‌లో ఒక స్పూన్ శీకాయ పౌడర్, మూడు స్పూన్లు భృంగ‌రాజ్ ఆయిల్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని జుట్టు మొత్తానికి ప‌ట్టించి.గంట అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేసేయాలి.

ఇలా వారంలో ఒక సారి చేస్తే హెయిర్ ఫాల్ స‌మ‌స్య త‌గ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

"""/"/ అలాగే చుండ్రు సమ‌స్య‌తో బాధ‌ ప‌డే వారు.ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు స్పూన్ల ఉసిరి కాయ‌ల పొడి మ‌రియు ఆరు స్పూన్ల భృంగ‌రాజ్ ఆయిల్ వేసుకుని బాగా క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి.గంట పాటు వ‌దిలేయాలి.

ఆపై కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉండే షాంపూతో హెడ్ బాత్ చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు దెబ్బ‌కు ప‌రార్ అవుతుంది.

ఇక ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ భంగ‌రాజ్ ఆయిల్‌, ఒక స్పూన్ కొబ్బరి నూనె, ఒక స్పూన్ ఆముదం వేసుకుని క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టు మొత్తానికి ప‌ట్టించి కాసేపు మ‌సాజ్ చేసుకోవాలి.అనంత‌రం త‌ల స్నానం చేయాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు చిట్ల‌డం, పొట్లిపోవ‌డం, తెల్ల‌ప‌డ‌టం వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

 .

గేమ్ ఛేంజర్ సినిమా పై వర్మ రివ్యూ…. అది తక్కువ అయ్యిందంటూ కామెంట్స్!